భావనగర్: డాక్టర్ గణేశ్ బరైయ్యా(Dr. Ganesh Baraiya)ను చూశారా? ఈయన ఎత్తు మూడు అడుగులే. కానీ పట్టుదల ఉన్న వ్యక్తి. ఎలాగైన వైద్య విద్య చేయాలనుకున్నాడు. సుప్రీంకోర్టులోనూ కేసు గెలిచి .. తన మెడికల్ కోర్సు పూర్తి చేశాడు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అంగవైకల్యం తన కలకు అడ్డు కాదు అని నిరూపించుకున్నాడు. పేదల సేవలో నిమగ్నమైన ఆ డాక్టర్ ఇప్పుడో సక్సెస్ స్టోరీకి నిదర్శనం.
#WATCH | Bhavnagar, Gujarat: Dr Ganesh Baraiya overcomes legal hurdles being differently abled and works as a medical officer at Bhavnagar’s Sir Takht Sinhji Civil Hospital
He says, “… My primary education was from my village… I took the NEET UG exam in 2018 but at that… pic.twitter.com/clvsx0PSQB
— ANI (@ANI) December 2, 2025
ఎత్తు తక్కువ.. శారీరక ఆరోగ్యం కూడా బలహీనమే. దీంతో ఎంబీబీఎస్ చదవాలన్న అతని ఆశయానికి ఎదురుదెబ్బ తగిలింది. 2018లో ఎంబీబీఎస్ చదవాలనుకున్న సమయంలో ఎంసీఐ అతనికి అడ్మిషన్ ఇవ్వలేదు. గణేశ్ అంగవైకల్యాన్ని దృష్టిలో పెట్టుకుని అడ్మిషన్‌ను నిరాకరించారు. 72 శాతం వైకల్యంతో ఉన్న గణేశ్ తన కలను నిజం చేసుకునేందుకు తీవ్ర న్యాయ పోరాటం చేశాడు. అవరోధాలు ఎన్ని ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదతను.
గుజరాత్‌లోని ఓ గ్రామంలో ప్రైవరీ విద్యను అభ్యసించినట్లు చెప్పాడు. 2018లో నీట్ యూజీ పరీక్షను రాశాను, కానీ తన వైకల్యం దృష్ట్యా.. మెడికల్ కౌన్సిల్ తనకు అడ్మిషన్ ఇవ్వలేదన్నాడు. ఆ సమయంలో తీవ్ర నిరాశకు లోనయ్యానన్నాడు. గుజరాత్ హైకోర్టులో కేసు ఓడిపోయాము. అయితే మళ్లీ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాం. వైకల్యం కారణంగా సీటు దక్కకపోవడం దారుణమని, మీ విద్యాభ్యాసాన్ని ఎవరూ అడ్డుకోలేరని, 2019లో సీటు రిజర్వ్ చేసి ఉంటుందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది.
#WATCH | Bhavnagar, Gujarat | Dr Ganesh Baraiya is 3 feet tall. He achieved his dream of becoming a doctor by winning a legal battle in the Supreme Court. The MCI denied him MBBS admission in 2018 due to his short height and physical disability. Ganesh, who is 72% disabled,… pic.twitter.com/CrB5r1surZ
— ANI (@ANI) December 2, 2025
లీగల్ చిక్కుల్ని దాటిన గణేశ్ ఎట్టకేలకు వైద్యవిద్యను పూర్తి చేశారు. ప్రస్తుతం భావనగర్‌లోని సర్ తక్త్ సిన్జీ సివిల్ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా వైద్య సేవలు అందిస్తున్నారు. స్థానికులకు బీపీ చెక్ చేస్తూ.. మందలు ఇస్తూ తన వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు.