చెన్నై: వారంతా ఉదయాన్నే మెట్రో రైలు (Metro Train) ఎక్కారు. ప్రయాణికులు మార్నింగ్ చేయలేదు అనుకుందో.. ఏమో.. ఆ రైలు.. ఒక్కసారిగా ఆగిపోయింది. ఎంతకూ కదలకపోవడంతో ప్రయాణికులు తమ కాళ్లకు పని చెప్పారు. పట్టాల వెంట ఒకరి వెనక వెనక ఒకరు సబ్వేలో (Subway) నడుచుకుంటూ తదుపరి స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఘటన చెన్నై మెట్రోలో (Chennai Metro Train) చోటుచేసుకున్నది.
మంగళవారం ఉదయం చెన్నై మెట్రోకి చెందిన రైలు విమ్కో నగర్ డిపో నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నది. ఈక్రమంలో సెంట్రల్ మెట్రో – హైకోర్టు స్టేషన్ మధ్య సబ్వేలో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సాంకేతిక లోపం (Technical Glitch), విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో రైలు అక్కడి నుంచి కదల్లేదు. దీంతో మధ్యలోనే దిగిన ప్రయాణికులు రైల్వే ట్రాక్‌పై నడవాల్సి వచ్చింది. సెంట్రల్ మెట్రో – హైకోర్టు స్టేషన్ మధ్య ఉన్న మెట్రో రైలు బ్లూ లైన్లో (Blue Line) సాంకేతిక లోపం, విద్యుత్తు సరఫరాలో సమస్యతో అసౌకర్యం తలెత్తినట్లు చెన్నై మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి అధికారులు క్షమాపణలు కోరారు. సమస్య పరిష్కారమవడంతో రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
మెట్రో రైలు 10 నిమిషాల పాటు సబ్వేలో నిలిచిపోయిందని, దీంతో అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న హైకోర్టు మెట్రో స్టేషన్‌కు పట్టాల మీదుగా నడిచివెళ్లాలని అధికారులు కోరినట్లు ప్రయాణికులు చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
A metro train in Chennai was halted between the High Court and Puratchi Thalaivar Metro stations amid rain in the city.
Immediate evacuation was done, and the train was promptly withdrawn from the line.
Normal operations resumed thereafter. pic.twitter.com/BGTTCiln9z
— Vani Mehrotra (@vani_mehrotra) December 2, 2025