Akhil | టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని కెరీర్లో బ్లాక్‌బస్టర్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. తొలి సినిమా అఖిల్ నుంచి ఇటీవల వచ్చిన ఏజెంట్ వరకూ ఆశించిన స్థాయి విజయం రాకపోవడంతో, అఖిల్ ఈసారి మాత్రం కచ్చితంగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు. అదే సంకల్పంతో ఆయన ప్రారంభించిన కొత్త చిత్రం లెనిన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంతో కూడిన మాస్ స్టోరీగా రూపొందుతోంది. రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ టీజర్‌కు అఖిల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుల నుంచీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ టీజర్‌తోనే “అఖిల్ కెరీర్లో ఇదే ఫస్ట్ బ్లాక్‌బస్టర్” అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇక మొదట ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల ఫిక్స్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఆమె ఫామ్, షెడ్యూల్ సమస్యల కారణంగా మేకర్స్ ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. ఈ మార్పు ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడేమో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. సినిమా కథలో కొన్ని కీలక మార్పులు చేస్తున్న నేపథ్యంలో, దర్శకుడు ఇప్పటికే భారీగా తీసిన ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను మళ్లీ రీషూట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.ఈ మార్పులు షూటింగ్ షెడ్యూల్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
అఖిల్ గత చిత్రం ఏజెంట్ డిజాస్టర్ అవడంతో, ఈసారి ఎలాంటి తప్పిదం జరగకుండా ప్రతీ సీక్వెన్స్‌ను డబుల్ చెక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ వరుస మార్పులు మాత్రం సినిమా మీద నెగటివ్ ఇంపాక్ట్ పడుతాయేమో అన్న అనుమానాలు తెచ్చాయి. ఇంత హడావిడి, మార్పులు చోటుచేసుకుంటున్నా…అఖిల్ మాత్రం ఈ సినిమా తన కెరీర్‌ను మలుపుతిప్పే మైల్స్టోన్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడట.అయితే ఈ మధ్య సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నాయి. అయితే భారీ అంచనాల నడుమ రానున్న లెనిన్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది, ఈ చిత్రంతో అయిన అఖిల్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సిందే.