Adani issue | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. అదానీ అంశంపై (Adani issue) చర్చ చేపట్టాలంటూ విపక్షపార్టీలు (opposition) డిమాండ్ చేశాయి. దీంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా పడ్డాయి.
లోక్‌సభ (Lok Sabha) ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీల ఎంపీలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితి తలెత్తింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభ (Rajya Sabha)లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో చైర్మన్ ధన్ఖర్ సభను మధ్యాహ్నం 11:30కు వాయిదా వేశారు.
#WATCH | Ruckus in Lok Sabha as the opposition demands discussion on the Adani issue.
Lok Sabha adjourned till 12 noon.
(Source: Sansad TV) pic.twitter.com/IcGClPwL9P
— ANI (@ANI) November 27, 2024
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం అటు రాజకీయ రంగంతోపాటు ఇటు వ్యాపార రంగంలోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్.. వివిధ రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు 265 మిలియన్ డాలర్లు (రూ. 2,238 కోట్లు) లంచంగా ఇవ్వజూపినట్టు న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. ఇక అదాని ఇష్యూపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతోంది.
ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్.. లోక్‌సభలో అదానీ లంచం ఆరోపణలపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ సైతం గౌతమ్ అదానీపై చర్చకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.
Also Read..
MLC Kavitha | ప్రజలు తిరగబడతారని ప్రభుత్వ పెద్దల్లో వణుకు : ఎమ్మెల్సీ కవిత
Naga Chaitanya – Sobhita | నయన్ బాటలో నాగచైతన్య-శోభిత.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న టీమ్
Samantha | అప్పుడే మయోసైటిస్ లక్షణాలు బయటపడ్డాయి : సమంత