Pinarayi Vijayan | వయనాడ్ జిల్లాలో కొండచరియలు (Wayanad landslide) విరిగిపడిన ఘటనలో బాధితులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.6 లక్షల ఆర్థిక సాయం (ex gratia) అందజేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా బాధితులకు అద్దె సాయంగా రూ.6 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
‘వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.6 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నాం. అదేవిధంగా బాధితులకు అద్దె సాయం కింద రూ.6 వేలు ఇవ్వనున్నాం. 60 శాతం గాయపడిన వారికి రూ.75,000, 40 నుంచి 50 శాతం గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తాం. తీవ్రంగా గాయపడిన వారికి అదనంగా రూ.50 వేలు సాయంగా అందజేస్తాం. ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (Chief Minister Disaster Relief Fund) నుంచి ఈ నిధులు కేటాయిస్తాం’ అని సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.
Wayanad landslide | Kerala CM Pinarayi Vijayan says, ” We will provide ₹6,000 as rent assistance to those affected by the Wayanad disaster, including those moving to relatives’ homes. The kin of the deceased will receive Rs 6 lakhs. Those who suffered 60% physical disability… pic.twitter.com/RbS6prAbn6
— ANI (@ANI) August 14, 2024
Also Read..
Encounter | జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ మృతి
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు
Mark Zuckerberg | భార్య ప్రిస్సిల్లాకు అపూర్వ కానుక ఇచ్చిన మెటా సీఈవో జుకర్‌బర్గ్.. ఫొటోలు వైరల్