Mark Zuckerberg | ఫేస్బుక్ (Facebook) సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో (Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) తన భార్య ప్రిస్సిల్లా చాను (Priscilla Chan)పై తనకున్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే అపూర్వ కానుక ఇచ్చారు. రోమన్ సంప్రదాయంలో ఆమె శిల్పాన్ని (giant sculpture) చెక్కించి బహుమతిగా ఇచ్చారు.
ఈ విగ్రహాన్ని ఇంటి పెరట్లో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జుకర్ బర్గ్ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు. తన విగ్రహం వద్ద ప్రిస్సిల్లా కాఫీ తాగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ శిల్పాన్ని న్యూయార్క్ నగరానికి చెందిన ప్రసిద్ధ కళాకారుడు డేనియల్ అర్షమ్ రూపొందించినట్లు తెలిసింది.
కాగా, జుకర్‌బర్గ్ – ప్రిస్సిల్లాది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇది కాస్తా ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్నారు. 2012 మే 19న వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంటకు ముగ్గురు సంతానం. 2015లో మాక్సిమా చాన్ అనే అమ్మాయి జన్మించింది. ఆ తర్వాత ఆగస్టు 2017లో మరో పాప ‘ఆగస్ట్’ జన్మించింది. ఇక గతేడాది అంటే 2023 మార్చిలో మరో పాప అరేలియా చాన్‌కు ప్రిస్సిల్లా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
Also Read..
Air India | ముంబై వెళ్లే విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. టేకాఫ్‌ను నిలిపివేసిన అధికారులు
Gallantry Awards | 1037 మందికి గ్యాలంట్రీ అవార్డులు.. ప్రకటించిన హోం శాఖ
Sheikh Hasina | నాకు న్యాయం కావాలి.. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలపై తొలిసారి స్పందించిన షేక్ హసీనా