శనివారం 31 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 07:00:42

వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి

వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి

రాయ్‌ఘడ్‌‌: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రాయ్‌ఘడ్‌ సమీపంలో వేగంగా వచ్చిన లారీ ఓ వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లో ఉన్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని రాయ్ఘడ్ జిల్లా ఎస్సీ సంతోష్‌ సింగ్ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించామన్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. పరారీలో ఉన్న లారీ డ్రైవరు కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.