సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 05, 2020 , 11:47:07

రాళ్ల‌తో పోలీసుల‌పై దాడి.. ఢిల్లీ వీడియో రిలీజ్‌

రాళ్ల‌తో పోలీసుల‌పై దాడి.. ఢిల్లీ వీడియో రిలీజ్‌

హైద‌రాబాద్‌:  ఇటీవ‌ల ఢిల్లీలో అల్ల‌ర్లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే.  ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన జ‌రిగిన .. ఓ హింసాత్మ‌క ఘ‌ట‌న గురించి తాజాగా ఓ వీడియో రిలీజైంది.  సీఏఏకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్న అల్ల‌రిమూక‌లు.. పోలీసుల్ని చుట్టుముట్టి రాళ్ల‌తో దాడి చేశారు. ఢిల్లీ పోలీసు విభాగంలో ప‌నిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ర‌త‌న్ లాల్‌.. ఈ దాడిలోనే గాయ‌ప‌డి మృతిచెందాడు.  అల్ల‌ర్ల గ్యాంగ్ చేసిన దాడిలో డీసీపీ శ్ర‌ద్ధా అమిత్ శ‌ర్మ‌, ఏసీపీ గోకుల్‌పురి అనూజ్‌లు కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  చాంద్‌భాగ్ ప్రాంతంలోనే ఐబీకి చెందిన అంకిత్ శ‌ర్మ అనే ఆఫీస‌ర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. రాళ్ల‌తో క్రూరంగా పోలీసుల‌పై దాడి చేసిన అల్ల‌రి మూక‌ల వీడియోను బీజేపీ నేత క‌పిల్ మిశ్రా ట్వీట్ చేశారు.  చాంద్‌భాగ్‌లో సీఏఏకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌ట్టిన మ‌హిళ‌లు, పురుషులు వీళ్లేనంటూ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.  ఢిల్లీ అల్ల‌ర్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 46కు చేరుకున్న‌ది.  logo