Ravan Effigy | దసరా (Dussehra).. అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రావణ దహనమే (Ravan Effigy). ఏటా విజయదశమిని (Vijayadashmi ) పురస్కరించుకుని రావణాసురుడి ప్రతిమలను దహనం చేస్తుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఓ వేడుకగా నిర్వహిస్తారు.
పండుగ రోజు రాత్రి రావణ దహనం చేస్తారు. రావణుడు, అతని సోదరుడు కుంభకర్ణుడు, కుమారుడు మేఘనాథ్ దిష్టిబొమ్మలను దహిస్తారు. ఈ ఏడాది కూడా విజయదశమి నాడు రాత్రి వేళ రావణ దహనం దేశ వ్యా్ప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అయితే, ఓ ప్రాంతంలో జరిగిన రావణ దహన కార్యక్రమం.. అణు పరీక్షను (Nuclear Blast) తలపించింది.
రావణాసురుడి దిష్టి బొమ్మను దహనం చేసిన కొద్ది సేపటికే ఊహించని పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి కార్యక్రమంలో పాల్గొన్న జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇది రావణ దహనమా..? లేక ‘అణు పరీక్ష..?’నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Dussehra❌ Nuclear test✅ pic.twitter.com/77UwOboZ72
— 𝐾𝑢𝑠ℎ𝕏ᡣ𐭩 (@aryansingh2466) October 13, 2024
Also Read..
Nobel Prize | ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
T20 World Cup 2024 | ఆసీస్‌పై ఛేదించాల్సిన లక్ష్యమే.. కానీ, వాళ్ల వల్లే ఓడాం
Group-1 Mains | గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల.. 21 నుంచి పరీక్షలు