T20 World Cup 2024 : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ అవకాశాల్ని భారత జట్టు (Team India) సంక్లిష్టం చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia)తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఆఖరి దాకా పోరాడి ఓడింది. భారీ ఛేదనలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అర్ధ శతకంతో వీరోచిత ప్రదర్శన చేసినా ఆసీస్‌ను విజయం తప్పింది. అయితే.. బౌలర్లు గొప్పగా రాణించిన చోట బ్యాటర్లు విఫలమవ్వడంతో భారత జట్టు పెద్ద మూల్యమే చెల్లించుకుంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ జట్టు ఓటమికి కారణాలను వెల్లడించింది. ఇంతకూ ఆమె ఏం చెప్పిందంటే..?
ఆస్ట్రేలియాపై 9 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓపెనర్లు స్వల్ప స్కోర్‌కే వికెట్ పారేసుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సైతం టీమిండియా పరాజయానికి ఓపెనర్ల వైఫల్యమూ ఓ కారణమని చెప్పేసింది. ‘ఆస్ట్రేలియా జట్టులో ప్రతి ఒక్కరు విజయానికి కృషి చేస్తారు. ఆ జట్టు ఏ ఒక్కరు లేదా ఇద్దరిమీద ఆధారపడదు. బౌలింగ్‌లో మేము వ్యూహాలు పక్కాగా అమలు చేశాం. మ్యాచ్‌లో మేము పోటీలోనే ఉన్నాం. అయితే.. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. పరుగులు అస్సలు ఇవ్వలేదు. దాంతో.. మాకు చాలా కష్టమైంది. ఎంతైనా ఆస్ట్రేలియా చాలా అనుభవం గల జట్టు’అని కౌర్ తెలిపింది.
Half-century for Captain Harmanpreet Kaur 🙌#TeamIndia need 15 off 7 deliveries 👌👌
📸: ICC
Follow the match ▶️ https://t.co/Nbe57MYlko#T20WorldCup | #INDvAUS | #WomenInBlue pic.twitter.com/RQYFgP61Ca
— BCCI Women (@BCCIWomen) October 13, 2024
అంతేకాదు.. తాను, దీప్తి శర్మ ఆడుతున్న సమయంలో గెలుపుపై నమ్మకం ఉందని.. కానీ, తాము కొన్ని చెత్త బంతుల్ని బౌండరీలకు పంపలేకపోయామని ఆమె అంది. ‘ఆసీస్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యం ఛేదించదగ్గదే. నేను, దీప్తి స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ఒత్తిడి తగ్గించాం. కానీ, కొన్ని చెత్త బంతుల్ని వదిలేశాం. ఆస్ట్రేలియా నుంచి మేము ఎంతో నేర్చుకుంటాం. మైదానంలోకి దిగాక మన చేతిలో ఉండని పరిస్థితుల గురించి ఆలోచించకుండా.. జట్టు విజయం కోసం మేము చేయగలిగినంత చేస్తాం. మాకు తర్వాతి మ్యాచ్ ఆడే అవకాశం వస్తే అది చాలా గొప్ప విషయం’ అని కౌర్ చెప్పింది.
Lone Warrior for India 🇮🇳, but it’s Hard to Beat 6 Time T20 WC Champs Australia 🇦🇺
Harmanpreet Kaur played an important knock & she was only one who took the match till the end, rest of the team played just mediocre cricket #INDWvsAUSW #HarmanpreetKaurpic.twitter.com/eUTBRGkMlG
— Richard Kettleborough (@RichKettle07) October 13, 2024
ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ 151 పరుగుల ఛేదనలో తడబడింది. సూపర్ హిట్ జోడీ అయిన షఫాలీ వర్మ(20), స్మృతి మంధాన(6)లు శుభారంభాన్ని భారీ స్కోర్‌గా మలచలేకపోయారు. ఈ ఇద్దరూ కనీసం పవర్ ప్లే వరకైనా నిలబడలేకపోయారు. దాంతో.. హర్మన్‌ప్రీత్‌పై మరోసారి గెలుపు భారం పడింది. జెమీమా రోడ్రిగ్స్(16), దీప్తి శర్మ(29)లతో కౌర్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది.
A valiant knock from Captain Harmanpreet Kaur 👏👏#TeamIndia came close to the target but it’s Australia who win the match by 9 runs in Sharjah.
📸: ICC
Scorecard ▶️ https://t.co/Nbe57MXNuQ#T20WorldCup | #INDvAUS | #WomenInBlue pic.twitter.com/jBJJhjSzae
— BCCI Women (@BCCIWomen) October 13, 2024
ఇక 17, 18వ ఓవర్లో బౌండరీలతో గెలుపు సమీకరణాలను 6 బంతుల్లో 14 పరుగులకు మార్చేసింది. కానీ, 20 వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసి.. పూజా వస్త్రాకర్‌కు స్ట్రయిక్ ఇవ్వడం మైనస్ అయింది. ఆమె భారీ షాట్ ఆడబోయి బౌల్డ్ కాగా.. ఆ తర్వాత శ్రేయాంక పాటిల్() రనౌట్.. అంతే.. టీమిండియా ఓటమి ఖాయమైంది. సోమవారం న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ సంచలన విజయం సాధిస్తే తప్ప భారత జట్టు సెమీస్ వెళ్లే పరిస్థితి లేకపోవడం బాధాకరం.