Air India | కోల్‌కతా వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి దేశ రాజధాని ఢిల్లీకి దారి మళ్లించారు.
ఎయిర్ ఇండియాకు చెందిన AI401 విమానం సోమవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ నుంచి కోల్‌కతాకు (Kolkata bound flight) బయల్దేరింది. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది (technical snag). నోస్ వీల్ దగ్గర సమస్య తలెత్తడంతో.. విమానాన్ని తిరిగి ఢిల్లీకి దారి మళ్లించాల్సి వచ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో (Delhi airport) విమానం సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అందులోని ప్రయాణికుల్ని వీలైనంత త్వరగా వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
Nagabandham | నాగబంధం సినిమాకు క్లాప్ కొట్టిన చిరంజీవి.. వివరాలివే
KTR | దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం : కేటీఆర్
Harish Rao | విపరీతంగా పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు.. మండిపడ్డ హరీశ్‌రావు