Harish Rao | హైదరాబాద్ : సామాన్యుల జేబులను ఖాళీ చేసేలా.. టీజీఎస్ ఆర్టీసీ టికెట్ ధరలను పెంచింది. టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసి టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్ళకు వెళ్లిన ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం అని ధ్వజమెత్తారు.
టికెట్ ధర రూ. 140తో జేబీఎస్ నుండి సిద్దిపేటకు వెళ్లిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో టికెట్ ధర రూ. 200 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. హనుమకొండ నుండి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ. 300 ఉంటే, పండుగ వేళ రూ.420కి ఛార్జీలు పెంచిందని తెలిపారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమే ప్రజా పాలనన ముఖ్యమంత్రి గారు..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Nampally Court | కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్.. తదుపరి విచారణ 18కి వాయిదా
Kamareddy | మంత్రాలు చేస్తున్నాడని, చెట్టుకు కట్టేసి వ్యక్తిపై దాడి.. కామారెడ్డి జిల్లాలో ఘటన
Liquor sales in Telangana | తెలంగాణలో రూ. 1100 కోట్లు దాటిన దసరా మద్యం అమ్మకాలు