Nagabandham | డెవిల్ సినిమాకు దర్శకత్వం వహించిన పాపులర్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా కాంపౌండ్ నుంచి వస్తోన్న రెండో ప్రాజెక్ట్ నాగబంధం-ది సీక్రెట్ ట్రెజర్ (Nagabandham). పాన్ ఇండియన్ పౌరాణిక కథాంశంతో వస్తోన్న ఈ చిత్రాన్ని కొన్ని నెలల క్రితమే ప్రకటించారని తెలిసిందే. ఈ మూవీ లాంచ్ కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో జరిగింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.
ఈ చిత్రంలో పెద కాపు ఫే విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ కెమెరా స్విచాన్ చేశారు. లీడ్ యాక్టర్లపై వచ్చే ఫస్ట్ షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా.. అజయ్ భూపతి మొదటి షాట్‌కి దర్శకత్వం వహించాడు. ఏషియన్ సునీల్ మేకర్స్‌కు స్క్రిప్ట్ అందజేశారు. ఈ చిత్రంలో జగపతి బాబు, జై ప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లక్ష్మీ ఇరా, దేవాన్ష్ నామా సమర్పణలో నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్‌పై కిషోర్ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తారక్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అక్టోబర్ 23 తర్వాత రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.
#Nagabandham Pooja ceremony took place today in the Presence of Renowned Personalities 🕉️🙏🏻
Clap by Mega 🌟 @KchiruTweets
Camera switched on by @YadavTalasani
First shot directed by @DirAjayBhupathi
Script handed over by @AsianSuniel @ViratKarrna @NabhaNatesh @IshMenon pic.twitter.com/a6uHDzzURJ— Suresh PRO (@SureshPRO_) October 14, 2024
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!
Lokesh Kanakaraj | లియోలో తప్పులు.. దర్శకుడు లోకేష్ కనకరాజ్‌పై విజయ్ తండ్రి ఫైర్