KTR | దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం : కేటీఆర్
KTR | వికారాబాద్ జిల్లా దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రాడార్ స్టేషన్ ఏర్పాటును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
KTR | హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నేవీకి సంబంధించిన వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఓ వైపు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పేరుతో లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతూనే మరోవైపు మూసీ నదిని పూర్తిగా ప్రమాదంలో పడేసే రాడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపడమేమిటని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదెక్కడి ద్వంద్వ వైఖరంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఏం ప్రయోజనాలు ఆశించి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుండటాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు కేటీఆర్.
మూసీనే ప్రమాదంలో పెట్టే ఈ ప్రాజెక్ట్‌కు ఎందుకు అంగీకారం తెలిపారు..?
దామగుండంలో రాడార్ ఏర్పాటు కారణంగా పర్యావరణానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని కేటీఆర్ చెప్పారు. దాదాపు 2900 ఎకరాల అటవీ భూభాగంతో పాటు 12 లక్షల చెట్లను నరికివేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టనున్నారన్నారు. జనవాసాలే లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ కేంద్రాన్ని ఎందుకు తెలంగాణలో నిర్మిస్తున్నారో చెప్పాలన్నారు. మాట్లాడితే మూసీ పరిరక్షణ అని చెబుతున్న ముఖ్యమంత్రి మూసీనే ప్రమాదంలో పెట్టే ఈ ప్రాజెక్ట్‌కు ఎందుకు అంగీకారం తెలిపారో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల సమయంలో ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలపలేదని కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలోనే అటవీ సామర్థ్యాన్ని పెంచేందుకు హరితహారం చేపట్టి అటవీ విస్తీర్ణాన్ని బీఆర్ఎస్ సర్కార్ పెంచిందన్నారు. అలాంటిది రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 2900 ఎకరాల అటవీ భూభాగాన్ని నాశనం చేసేలా చర్యలు చేపట్టడమేమిటని కేటీఆర్ ప్రశ్నించారు.
గంగోత్రికి ఒక న్యాయం.. మా మూసీ నదికి మరో న్యాయమా..?
గంగానది జన్మస్థానం గంగోత్రి వద్ద 150 కిలోమీటర్ల పరిధిని కేంద్రం ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించిన విషయాన్నికేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గంగోత్రికి ఒక న్యాయం, మా మూసీ నదికి మరో న్యాయమా అంటూ నిలదీశారు. దామగుండంలో ఏర్పాటు చేస్తున్న రాడార్ కేంద్రం వికారాబాద్ అడవుల్లోనే మూసీ జన్మస్థానంలోనే ఉందన్నారు. నది పుట్టిన ప్రాంతాన్ని “ఎకో సెన్సిటివ్ జోన్”గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేవీ రాడార్ ఏర్పాటుతో మూసీ నది అంతర్థానం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. “సోర్స్ అఫ్ ద రివర్”పై ఇది గొడ్డలి పెట్టని చెప్పారు. మూసీ నది పురుడు పోసుకున్న చోట 12 లక్షల చెట్ల నరికివేతతో కోలుకోలేని అనర్థం జరుగుతుందన్నారు. పర్యావరణ సమతుల్యతకు పెనుప్రమాదాన్ని సృష్టించే ఈ ప్రాజెక్ట్‌ను విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా పర్యావరణ వేత్తలతో కలిసి బీఆర్ఎస్ పోరాటం..
మూసీ నదిని ఫణంగా పెట్టేందుకు సహకరిస్తూ మరో వైపు మూసీ పరిరక్షణ అంటూ ముఖ్యమంత్రి డ్రామాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మూసీ పరిరక్షణపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రాడార్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం తెలిపేది కాదన్నారు. మూసీ పేరుతో వేల కోట్ల దోపిడీ చేయాలన్న ఆలోచనే తప్ప నిజంగా నది పరిరక్షణపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ది లేదన్నారు. దేశ రక్షణ విషయంలో తెలంగాణ ముందుంటుంది కానీ జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ కేంద్రాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి నష్టం చేస్తామంటే అంగీకరించమని చెప్పారు. రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా పర్యావరణ వేత్తలతో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | విపరీతంగా పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు.. మండిపడ్డ హరీశ్‌రావు
Nampally Court | కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్.. తదుపరి విచారణ 18కి వాయిదా
Liquor sales in Telangana | తెలంగాణలో రూ. 1100 కోట్లు దాటిన దసరా మద్యం అమ్మకాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

