Group-1 Mains | గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల.. 21 నుంచి పరీక్షలు
Group-1 Mains | గ్రూప్-1 మెయిన్స్ (Group 1 Mains) హాల్ టికెట్లను టీజీపీఎస్సీ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. హాల్ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
Group-1 Mains | హైదరాబాద్ : గ్రూప్-1 మెయిన్స్ (Group 1 Mains) హాల్ టికెట్లను టీజీపీఎస్సీ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. హాల్ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21 ఉదయం వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. హైదరాబాద్(హెచ్ఎండీఏతో సహా) పరిధిలో అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి.
563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే గైడ్‌లైన్స్ కూడా విడుదల చేసింది. తొలిరోజు తీసుకెళ్లిన హాల్ టిక్కెట్‌నే మిగిలిన ఆరు పరీక్షలకు తీసుకెళ్లాలని.. రోజుకో కొత్త హాల్ టిక్కెట్‌తో వెళితే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ప్రతిపరీక్ష రోజు హాల్ టిక్కెట్‌పై తప్పనిసరిగా సంతకం చేయాలని తెలిపింది. నియామక ప్రక్రియ పూర్తి అయ్యేవరకు హాల్ టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించింది.
గ్రూప్-1పై రేపు హైకోర్టు తీర్పు..
కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును మంగళవారం వెలువరించనున్నది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచారణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పునివ్వనుంది. ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొన్నది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ ‘కీ’లో తప్పులున్నట్టు తాము ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించామని, కాబట్టి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని, వికీపీడియా, గూగుల్ ఆధారంగా ఫైనల్ ‘కీ’ని రూపొందించామని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలపడం వంటి అంశాలు తమకు అనుకూలంగా మారతాయని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు.
గ్రూప్-1పై హైకోర్టులో 15కుపైగా కేసులు ఉన్నాయి. వీటిలో ఫైనల్ ‘కీ’పై వేసిన కేసు అత్యంత కీలకమైనది. వీటితోపాటు ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో-33పై దాఖలైన కేసు, గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి 503 పోస్టులు, కొత్త నోటిఫికేషన్లో అదనంగా చేర్చిన 60 పోస్టులకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశం ఇవ్వాలన్న అంశంపై వేసిన కేసు, హైకోర్టు మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో, పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంపై వేసిన కేసులపై కూడా తీర్పు రానున్నది. ఈ నెల 16న రిజర్వేషన్లపై వేసిన మరో మూడు కేసులు సైతం హైకోర్టు ముందు విచారణకు రానున్నాయి.
ఇవి కూడా చదవండి..
KTR | దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం : కేటీఆర్
Harish Rao | విపరీతంగా పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు.. మండిపడ్డ హరీశ్‌రావు
Nampally Court | కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్.. తదుపరి విచారణ 18కి వాయిదా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar MLA Anant Singh | కుమార్తె పెళ్లి సందర్భంగా గుర్రపు పోటీలు.. విజేతకు ‘థార్’ బహుకరించనున్న ఎమ్మెల్యే
Harihara Putra | అయ్యప్ప భక్తి నేపథ్యంలో వైభవ్ ‘హరిహర పుత్ర’.. ఆకట్టుకుంటున్న టీజర్!
Komatireddy Rajagopal Reddy | ఖబడ్దార్ బిడ్డా యుద్దం స్టార్ట్ అయితది.. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్
Donald Trump: ట్రంప్‌ను హత్తుకున్న జిన్‌పింగ్.. చైనాకు ఎన్విడియా చిప్స్ బంద్
Dogra Front | లష్కరే ఉగ్రవాది ఎన్కౌంటర్.. జమ్ముకశ్మీర్‌లో డోగ్రా ఫ్రంట్ సంబురాలు.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

