England : సుదీర్ఘ ఫార్మాట్లో రికార్డు స్కోర్ కొట్టిన ఇంగ్లండ్ (England)కు గుడ్‌న్యూస్. రెండు నెలలకు జట్టుకు దూరమైన కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) వచ్చేస్తున్నాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న స్టోక్స్ పాకిస్థాన్‌తో రెండో టెస్టుకు జట్టులోకి వచ్చాడు. అక్టోబర్ 15 నుంచి ముల్తాన్‌లో జరుగబోయే మ్యాచ్‌కు ఇంగ్లండ్ రెండు మార్పులు చేసింది. సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్, లార్డ్స్ హీరో గస్ అట్కిన్సన్‌లకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. వోక్స్ స్థానంలో స్టోక్స్ జట్టులోకి రాగా.. అట్కిన్సన్ బదులు మాథ్యూ పాట్స్ తుది జట్టులోకి వచ్చాడు.
పాకిస్థాన్ గడ్డపై టెస్టు సిరీస్‌లో బోణీ కొట్టిన ఇంగ్లండ్ రెండ్ మ్యాచ్‌లో విజయంపై కన్నేసింది. అందులో భాగంగానే బలమైన టీమ్‌ను ఎంపిక చేసింది. ‘పాక్‌తో రెండు టెస్టు కోసం ఇంగ్లండ్ పురుషుల జట్టు 11 మందిని ఎంపిక చేశాం. పేసర్లు అట్కిన్సన్, వోక్స్‌లకు విశ్రాంతినిచ్చాం. ఇక.. కెప్టెన్ బెన్ స్టోక్స్ నాలుగు టెస్టుల విరామం తర్వాత జట్టులోకి వచ్చాడు. ఆగస్టు నుంచి తొడ కండరాల గాయంతో బాధ పడుతున్న అతడు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. లార్డ్స్‌లో శ్రీలంకపై ఆడిన పేసర్ మాథ్యూ పాట్స్‌ను తీసుకున్నాం’ అని ఇంగ్లండ్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
⬅️ Gus Atkinson
⬅️ Chris Woakes➡️ Matt Potts
➡️ Ben StokesFull focus on securing the series win 👊 pic.twitter.com/wUU8gD6q4g
— England Cricket (@englandcricket) October 14, 2024
ఇంగ్లండ్ తుది జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్, బ్రైడన్ కార్సే, మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, షోయబ్ బషీర్.
ఓవల్ టెస్టులో శ్రీలంక చేతిలో కంగుతిన్న ఇంగ్లండ్ ముల్తాన్‌లో అదరగొట్టింది. యువకెరటం హ్యారీ బ్రూక్(317), మాజీ కెప్టెన్ జో రూట్(162)లు విధ్వంసక బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లుకు చుక్కలు చూపించారు. ఈ ఇద్దరి రికార్డు భాగస్వామ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో 817 -7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం జాక్ లీచ్ విజృంభణతో పాకిస్థాన్‌ను ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది.