హైదరాబాద్ : నిరుపేదలకు చేయూతనందించడంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. మరోసారి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి(MLA Bhandari) తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థిని(MBBS student) చదువుకి ఆర్థిక సహాయం(Financial assistance) అందజేసి అండగా నిలబడ్డారు. వివరాలల్లోకి వెళ్తే..చర్లపల్లి డివిజన్ మధుసూదన్ రెడ్డి కాలనీకి చెందిన లింగోజీ రమేశ్ – మంగమ్మ కుమార్తె తేజ శ్రీ కొత్తగూడం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.
ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తన సొంత నిధులతో బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్కి అయ్యే ఫీజు 29,000 రూపాయల చెక్కును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఎవరైనా ఎంబీబీఎస్ సీటు సాధిస్తే ఫీజు మొత్తం తానే చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.