Coolie | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్న అరుదైన దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి ప్రస్తుతం కూలీ (Coolie) సినిమా వస్తుందని తెలిసిందే. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అయితే కూలీ కూడా ఇదే జోనర్లో వస్తుందా.. ? అని చర్చించుకుంటున్న సినీ జనాలకు క్లారిటీ ఇచ్చాడు లోకేశ్ కనగరాజ్. ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ మాట్లాడుతూ. కూలీ LCU పరిధిలోకి రాదని, పూర్తిగా ఇండిపెండెంట్ సినిమా అని అన్నాడు. ఈ చిత్రాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నా. రజినీకాంత్ త్వరలోనే సెట్స్‌లో జాయిన్ కానున్నారని చెప్పాడు. ఇప్పుడీ కామెంట్స్‌తో కూలీ సినిమాకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చినట్టైంది.
గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కూలీలో పాపులర్ యాక్టర్ సత్యరాజ్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీలో రజినీకాంత్ స్మగ్లర్‌గా కనిపించబోతుండగా.. శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అక్కినేని నాగార్జున, మహేంద్రన్, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ (Soubin Shahir) కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తు్న్నారు. ఇప్పటికే షేర్ చేసిన టైటిల్ టీజర్లో బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్ ఛైన్లతో సూపర్ స్టార్ చేస్తున్న స్టైలిష్ ఫైట్ సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
Lokesh Kanakaraj | లియోలో తప్పులు.. దర్శకుడు లోకేష్ కనకరాజ్‌పై విజయ్ తండ్రి ఫైర్