Rats | కిలోల కొద్దీ గంజాయిని తినేసిన ఎలుకలు.. కేసు నుంచి ఈజీగా బయటపడ్డ నిందితులు
Rats | ఎలుకలు (Rats) చేసిన పనికి ఇద్దరు నిందితులు గంజాయి స్మగ్లింగ్ కేసు నుంచి చాలా ఈజీగా బయటపడ్డారు. ఈ ఘటన తమిళనాడు చెన్నై (Chennai)లో వెలుగు చూసింది.
Rats | ఎలుకలు (Rats) చేసిన పనికి ఇద్దరు నిందితులు గంజాయి స్మగ్లింగ్ కేసు నుంచి చాలా ఈజీగా బయటపడ్డారు. ఈ ఘటన తమిళనాడు చెన్నై (Chennai)లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..
చెన్నై మెరీనా బీచ్ పరిసరాల్లో రెండేళ్ల క్రితం ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు దొరికిపోయారు. బీచ్ పరిసరాల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న రాజగోపాల్, నాగేశ్వరరావులను పోలీసులు 2020లో అరెస్ట్ చేశారు. వారిపై విచారణ ప్రారంభించి చార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ చెన్నై హైకోర్టు పరిధిలోని మాదకద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. కేసుకు సంబంధించి పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి 22 కిలోల గంజాయి (marijuana)ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 50 గ్రాముల గంజాయిని టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు.
కాగా, ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా సాక్షాధారాలు చూపించాల్సి వచ్చింది. దీంతో వారు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 22 గ్రాముల గంజాయిలో కేవలం 50 గ్రాముల గంజాయిని మాత్రమే చూపించారు. అయితే న్యాయమూర్తి మిగిలిన మొత్తం ఎక్కడా..? అని ప్రశ్నించగా.. ఎలుకలు తినేశాయి అంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో చార్జి షీట్ లో పేర్కొన్న గంజాయి మొత్తాన్ని పోలీసులు సమర్పించలేకపోవడంతో ఈ కేసును కోర్టు కొట్టివేసింది. నిందితులు రాజగోపాల్, నాగేశ్వరరావులను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో ఈ ఘటన కాస్తా ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
Also Read..
Roller Coaster | రైడ్ మధ్యలో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. 3 గంటల పాటు తలకిందులుగా అలాగే.. వీడియో
Niharika Konidela | విడాకులను ప్రకటించిన నిహారిక-చైతన్య.. సోషల్ మీడియాలో పోస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

