Roller Coaster | రోలర్ కోస్టర్ (Roller Coaster).. దీని గురించి తెలియని వారు ఉండరు. పై నుంచి రయ్యిమంటూ కిందకి జారిపోతూ.. మనకు తెలియకుండానే గింగిరాలు తిరుగతూ ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ రోలర్ కోస్టర్ రైడ్ అంటే చాలా మందికి భయం.. మరికొంత మందికి మహా సరదా. ఈ సరదా గేమ్ కొందరికి భయంకరమైన అనుభూతిని కలిగించింది.
జనంతో కిక్కిరిసి ఉన్న రోలర్ కోస్టర్.. రైడ్ జరుగుతున్న సమయంలో సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా మూడు గంటల పాటు తలకిందులుగా వేలాడుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికా (America)లోని ఓ అమ్యూజ్ మెంట్ పార్కులో చోటు చేసుకుంది.
క్రాండన్ పార్క్ ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్ ( Forest County Festival in Crandon Park) లో కొంత మంది రోలర్ కోస్టర్ రైడ్ కు వెళ్లారు. ఈ రైడ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. ఇంకేముంది రైడ్ కు వెళ్లిన వారంతా తలకిందులుగా వేలాడుతూ అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. ఏ మాత్రం పట్టుతప్పినా పై ప్రాణాలు పైకే పోయేవి. ఇందుకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Eight people hung upside down for about three hours, stuck in a roller coaster-like attraction.
Emergency happened at a festival in American Wisconsin. Local media write that seven of the eight stranded are children. According to preliminary data, everyone got off with fright. pic.twitter.com/OP3Ow3syQZ— Sasha White (@rusashanews) July 4, 2023
Also Read..
Niharika Konidela | విడాకులను ప్రకటించిన నిహారిక-చైతన్య.. సోషల్ మీడియాలో పోస్ట్
Kerala Heavy rains | కేరళలో భారీ వర్షం.. పాఠశాలలు మూసివేత.. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్