Rashmika Mandanna | రష్మిక డీప్‌ఫేక్ వీడియో.. వివరాలు అందించాలంటూ మెటాకు ఢిల్లీ పోలీసుల లేఖ
Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో (DeepFake Video) ఒకటి ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు (Delhi Police) చర్యలకు ఉపక్రమించారు.
Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో (DeepFake Video) ఒకటి ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీ శాఖ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు (Delhi Police) చర్యలకు ఉపక్రమించారు. మార్ఫింగ్ వీడియోపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వీడియో ఏ అకౌంట్ నుంచి తొలుత అప్లోడ్ అయ్యిందో అందుకు సంబంధించిన యూఆర్ఎల్ వివరాలను అందించాలంటూ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta)ను కోరారు. అదేవిధంగా నకిలీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారి వివరాలను కూడా అందించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మెటా సంస్థకు ఢిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు తెలిపాయి.
రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు, రష్మిక అభిమానులే కాదు పలువురు స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్ మొదలుకుని, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేశ్ ఇలా టాలీవుడ్ ప్రముఖులు అందరూ రష్మికకు మద్దతుగా నిలిచారు. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
Also Read..
Chandramohan | కె.విశ్వనాథ్, ఎస్పీబాలుతో చంద్రమోహన్‌కు ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా..?
Chandramohan | సంపాదించిన దాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ.. చంద్రమోహన్ ఎమోషనల్ ఇంటర్వ్యూ
Chandramohan | చంద్రమోహన్ ఇన్నేండ్లు సినీ ఇండస్ట్రీలో దిగ్విజయంగా కొనసాగాడంటే.. దానికి కారణమదే!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

