Chandramohan | కె.విశ్వనాథ్, ఎస్పీబాలుతో చంద్రమోహన్‌కు ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా..?
Chandramohan | ఒకరేమో తెలుగు దిగ్గజ దర్శకుడు. స్వాతిముత్యం.. సిరివెన్నెల.. ఒకటా రెండా ఎన్నో ఆణిముత్యాలను వెండితెరకు అందించిన కళాతపస్వి (K Viswanath). ఇంకొకరు వేలాది పాటలు పాడి.. కోట్లాది మంది మనసుల్ని గెలుచుకున్న గాన గంధర్వుడు (sp balasubrahmanyam). సినీ ఇండస్ట్రీలోని ఈ ఇద్దరు దిగ్గజాలతో నటుడు చంద్రమోహన్ (Chandramohan)కు ఎనలేని అనుబంధం ఉంది.
Chandramohan | ఒకరేమో తెలుగు దిగ్గజ దర్శకుడు. స్వాతిముత్యం.. సిరివెన్నెల.. ఒకటా రెండా ఎన్నో ఆణిముత్యాలను వెండితెరకు అందించిన కళాతపస్వి (K Viswanath). ఇంకొకరు వేలాది పాటలు పాడి.. కోట్లాది మంది మనసుల్ని గెలుచుకున్న గాన గంధర్వుడు (sp balasubrahmanyam). సినీ ఇండస్ట్రీలోని ఈ ఇద్దరు దిగ్గజాలతో నటుడు చంద్రమోహన్ (Chandramohan)కు ఎనలేని అనుబంధం ఉంది. చంద్రమోహన్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఈ ఇద్దరూ ఆయన్ని ఓ నటుడిగా నిలబెట్టారు. ఆయన కెరీర్లో చిరస్థాయిలో నిలిచిపోయే పాత్రలు, పాటలను అందించారు. వీరి మధ్య సినిమా బంధమే కాదు.. రక్తసంబంధం కూడా ఉందని, వీరు ముగ్గురూ అక్కాచెల్లెళ్ల పిల్లలే అని చాలా తక్కువ మందికి తెలుసు.
కె విశ్వనాథ్ తండ్రి పెద్ద భార్య, చంద్రమోహన్ తల్లి ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. అలా వీరిద్దరి మధ్య అన్నదమ్ముల బంధం ఏర్పడింది. అలాగే చంద్రమోహన్ మరదలిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. అలా వీరిద్దరు కూడా అన్నదమ్ములు అవుతారు. కాకపోతే సొంత అన్నదమ్ములు కాదు. కజిన్ బ్రదర్స్. ఇలా ఈ ముగ్గురికి ఫ్యామిలీ పరంగా మంచి రిలేషన్ షిప్ ఉంది. ఆ విషయం సినిమాల్లోకి వచ్చాక తెలిసింది. కానీ దాన్ని బయటకు రాకుండానే వాళ్లు మ్యానేజ్ చేస్తూ తమ తమ రంగాల్లో రాణిస్తూ వచ్చారు.
రక్తసంబంధమే కాదు.. ముగ్గురూ ఓ చిత్రానికి కలిసి పనిచేయడం మరో విశేషం. అదే ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ‘శంకరాభరణం’. 1980లో రిలీజైన ఈ చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించగా, ఇందులో ఓ కీలక పాత్రలో చంద్రమోహన్ నటించారు. ఇక ఈ చిత్రంలో బాలు తన గాత్రంతో ఆకట్టుకున్నారు. ఆయన పాడిన పాటలు ఎంతటి వినసొంపుగా ఉంటాయో తెలిసిందే. అలా ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి చేసిన ‘శంకరాభరణం’ తెలుగు చిత్ర పరిశ్రమలో చిరకాలం గుర్తిండిపోయే చిత్రంగా నిలిచింది.
మరోవిశేషం ఏంటంటే ఈ ముగ్గురు అన్నదమ్ములూ ఒకేసారి ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయడం. కె. విశ్వనాథ్ 1966లో ‘ఆత్మ గౌరవం’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. ఇక అదే ఏడాది ‘రంగులరాట్నం’ చిత్రంతో నటుడిగా చంద్రమోహన్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాతి ఏడాది ‘శ్రీ శ్రీ మర్యాద రామన్న’ చిత్రంతో సింగర్‌గా బాలు వెండితెరకి పరిచయం అయ్యారు. ఇక అప్పటి నుంచి ఈ ముగ్గురూ తమ విభాగాల్లో ఉన్నతులుగా ఎదుగుతూ చిరస్థాయిలో నిలిచారు.
ఇక ఈ ముగ్గురు లెజెండరీలూ ప్రస్తుతం ఈ లోకంలో లేరు. మూడేళ్ల క్రితం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ ఏడాది ఆరంభంలో వృద్ధాప్యం కారణాలతో కళాతపస్వి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అనారోగ్యం కారణంగా చంద్రమోహన్ తాజాగా కన్నుమూశారు. దీంతో వీరి మధ్య ఉన్న బంధం గురించి ఇప్పుడు తెరపైకి వచ్చింది.
Also Read..
Chandramohan | సంపాదించిన దాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ.. చంద్రమోహన్ ఎమోషనల్ ఇంటర్వ్యూ
Chandramohan | చంద్రమోహన్ ఇన్నేండ్లు సినీ ఇండస్ట్రీలో దిగ్విజయంగా కొనసాగాడంటే.. దానికి కారణమదే!
ChandraMohan | టాలీవుడ్లో తీవ్ర విషాదం.. నటుడు చంద్రమోహన్ మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

