Chandramohan | సంపాదించిన దాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ.. చంద్రమోహన్ ఎమోషనల్ ఇంటర్వ్యూ
Chandramohan | హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇలా విభిన్న పాత్రలతో మెప్పించిన నటుడు చంద్రమోహన్ (Chandramohan) తన జీవితంలో సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ. ఈ విషయాన్ని చంద్రమోహనే ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించారు.
Chandramohan | హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇలా విభిన్న పాత్రలతో మెప్పించిన నటుడు చంద్రమోహన్ (Chandramohan) ఇక లేరు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఇండస్ట్రీలో లక్కీ హీరోగా ఓ వెలుగు వెలిగిన చంద్రమోహన్.. సినిమాల ద్వారా బాగానే సంపాదించుకున్నారు. అయితే ఆ ఆస్తులను నిలబెట్టుకోలేకపోయారు. అలా రూ.కోట్లు విలువ చేసే ప్రాపర్టీస్‌ను అమ్ముకున్నారు. ఈ విషయాన్ని చంద్రమోహనే ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించారు.
1966లో రంగులరాట్నం సినిమాతో సినీ కెరీర్‌ను మొదలుపెట్టిన చంద్రమోహన్.. తొమ్మిది వందలకు పైగా చిత్రాల్లో నటించాడు. 175 చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించారు. కొత్తగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లకు లక్కీ హీరోగా కూడా అప్పట్లో పేరు తెచ్చుకున్నారు. అలా చంద్రమోహన్ నటించిన సిరిసిరిమువ్వ సినిమాతో జయప్రద, పదహరేళ్ల వయసు సినిమాతో శ్రీదేవి తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తిరుగులేని కథానాయికలుగా ఓ వెలుగు వెలిగారు. 932 సినిమాల్లో నటించిన చంద్రమోహన్.. బాగానే ఆస్తులను కొనుక్కున్నారు. అయితే, ఆ ప్రాపర్టీస్‌ను నిలబెట్టుకోలేకపోయారు. సంపాదించినదాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అని చంద్రమోహనే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.
గతేడాది తన భార్య, ప్రముఖ రచయిత్రి జలంధరతో కలిసి చంద్రమోహన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చంద్రమోహన్‌ను చాలామంది లక్కీగా భావిస్తారని.. ఆయన చేత్తో ఒక్క రూపాయి తీసుకున్నా కలిసొస్తుందని నమ్ముతారని జలంధర ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇప్పటికీ జనవరి ఒకటో తేదీన ఎంతోమంది వచ్చి.. ఆయన చేత్తో డబ్బులు తీసుకొని వెళ్తారని చెప్పుకొచ్చింది. భార్య మాటలు వినగానే చంద్రమోహన్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ.. శోభన్‌బాబు ఎంత చెప్పినా వినకుండా వంద కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నానని ఎమోషన్ అయ్యారు.
‘అప్పట్లో కొంపల్లి దగ్గర గొల్లపూడి మారుతీరావు ద్రాక్షతోట తీసుకున్నారు. ఆయన సలహాతో నేనూ 35 ఎకరాలు కొన్నాను. కానీ దాన్ని మేనేజ్ చేయలేక అమ్మేశాను. శోభన్ బాబు ఎంత చెప్తున్నా వినకుండా మద్రాసులోని 15 ఎకరాలను కూడా అమ్ముకున్నా. ఇప్పుడు దాని విలువ రూ.30 కోట్లకుపైనే . అలాగే శంషాబాద్ దగ్గర మెయిన్ రోడ్డుకు 6 ఎకరాలు కొని.. అదీ అమ్మేశాను. ఇప్పుడు అక్కడ మంచి మంచి రిసార్టులు పెట్టారు. ఇలా దాదాపు రూ.100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నా. నా జీవితంలో సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ’ అని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు.
Also Read..
ChandraMohan | టాలీవుడ్లో తీవ్ర విషాదం.. నటుడు చంద్రమోహన్ మృతి
Chandramohan | చంద్రమోహన్ ఇన్నేండ్లు సినీ ఇండస్ట్రీలో దిగ్విజయంగా కొనసాగాడంటే.. దానికి కారణమదే!
Chandra Mohan | చంద్రమోహన్‌తో సినిమా చేస్తే చాలు ఆ హీరోయిన్ లక్కు తిరిగినట్టే.!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

