Chandra Mohan | చంద్రమోహన్‌తో సినిమా చేస్తే చాలు ఆ హీరోయిన్ లక్కు తిరిగినట్టే.!
Chandra mohan | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ (80) (Chandramohan) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
Chandra mohan |సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ఓ టాక్ నడిచేది. చంద్రమోహన్‌తో ఏ హీరోయిన్‌తో నటించినా సరే ఆమె దశ తిరిగిపోతుంది. అదృష్టం కలిసొచ్చి స్టార్ హీరోయిన్లుగా మారిపోతారు. ఇందుకు శ్రీదేవి, జయప్రదే ఉదాహరణ. వీళ్లు కేవలం టాలీవుడ్లోనే కాదు మిగతా ఇండస్ట్రీల్లోకి కూడా అడుగుపెట్టి చక్రం తిప్పారు. కేవలం శ్రీదేవి, జయప్రదనే కాదు.. ఇంకా చాలామంది హీరోయిన్ల విషయంలో ఇది నిజమైంది. మరి ఆ హీరోయిన్ల జాబితాలో ఎవరున్నారో ఒకసారి చూద్దాం..
చంద్రమోహన్ నటించిన స్టార్ హీరోయిన్స్ ఒకసారి చూసుకుంటే.. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సిరిసిరిమువ్వలు (1976). చంద్రమోహన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జయప్రద హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కాగా ఈ సినిమా తరువాతే జాక్‌పాట్ కొట్టింది జయప్రద. ఎన్టీఆర్ సరసన అడవి రాముడు, యమగోల, సినిమాలకు ఛాన్స్ దక్కించుకుంది. ఆ తరువాత 1978లో ‘పదహారేళ్ల వయసు’ సినిమా అంటూ సినిమా రాగా చంద్రమోహన్-శ్రీదేవి జంటగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సినిమా తర్వాత శ్రీదేవి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పైకిలేచింది. వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించింది శ్రీదేవి.
అదే సంవత్సరం చంద్రమోహన్, జయసుధ జంటగా కలిసి నటించిన చిత్రం ప్రాణం ఖరీదు (1978). ఈ సినిమా తరువాత జయసుధ తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక దీని తరువాత 1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్ -విజయశాంతి కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత వీరి కాంబోలో వచ్చిన ప్రతిఘటన కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక చంద్ర మోహన్‌తో నటించిన తర్వాతే విజయశాంతి శోభన్‌బాబు, నాగేశ్వరరావు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించింది. అంతటి లక్కీ హ్యాండ్ చంద్రమోహన్ ది. అయితే ఇంతమంది స్టార్ హీరోయిన్స్ కెరీర్లో తోడుగా నిలిచిన చంద్రమోహన్ తన కెరీర్ విషయం వచ్చేవరకు మాత్రం స్టార్ హీరో కాలేకపోయాడు.
కాగా తాను స్టార్ హీరో ఎందుకు అవ్వలేదు అనే విషయంపై చంద్రమోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యాదృచ్చికమే అయినా నా పక్కన నటించిన దాదాపు 60 మంది కథానాయికల్లో అత్యధికులు అగ్ర స్థానానికి చేరుకున్నారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ, విజయశాంతి.. ఇలా ఎంతమందికో నేను తొలి హీరోను. అయితే అందులో నా ప్రతిభ ఏమీ లేదు. అది వారి అదృష్టం, ప్రతిభ. ‘చంద్రమోహన్ పక్కన నటిస్తే టాప్ హీరోయిన్ పొజిషన్ గ్యారంటీ’ అనే సెంటిమెంట్ వ్యాపించేలా చేశారు. అంతేకాని నా దగ్గర ఎటువంటి మ్యాజిక్ లేదు అంటూ చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

