ChandraMohan | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ (ChandraMohan) మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 82. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు చంద్రమోహన్ మృతికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
1942 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో ఆయన జన్మించారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. బాపట్లలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఏలూరులో పనిచేశారు. సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు వెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. 1966లో ‘రంగులరాట్నం’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి నటుడిగా, సహాయనటుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. మొత్తం 932కిపైగా చిత్రాల్లో నటించారు. హీరోగా సుమారు 175 సినిమాలకు పైగా చేశారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారానే ఆయన విశేష ప్రేక్షకాదరణ పొందారు. ఆయన నటనకు గానూ రెండు ఫిల్మ్‌ఫేర్, ఆరు నంది అవార్డులు వరించాయి.
Also Read..
Palvai Sravanthi | మునుగోడులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా
వైద్యచరిత్రలో అద్భుతం.. ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్చిన అమెరికా సర్జన్లు