మంగళవారం 11 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 17:20:14

రామాల‌య భూమిపూజ‌కు తగ్గిన ఆహ్వానితుల జాబితా

రామాల‌య భూమిపూజ‌కు తగ్గిన ఆహ్వానితుల జాబితా

ల‌క్నో : రామాల‌య భూమిపూజ ఆహ్వానితుల జాబితా త‌గ్గింది. భూమి పూజ కార్య‌క్ర‌మానికి మొద‌ట‌గా 208 మంది అతిథుల‌ను ఆహ్వానించాల‌నుకున్నా ఈ సంఖ్య ప్ర‌స్తుతం 170 నుంచి 180కి ప‌డిపోయింది. క‌రోనా వైర‌స్ సంక్షోభం నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా స‌మాచారం. ఆగ‌స్టు 5న రామ మందిర నిర్మాణానికి పునాది రాయి వేసే కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ, మాజీ హెచ్‌ఆర్‌డి మంత్రి ముర‌ళి మనోహర్ జోషి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అయోధ్యలో జరిగే రామ్ మందిర భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం. రామాల‌య భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానితుల జాబితా ఈ విధంగా ఉంది. 

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్, రామజ‌న్మ‌భూమి న్యాస్ చీఫ్ నృత్య గోపాల్ దాస్, భ‌య్యాజీ జోషీ, ద‌త్తాత్రేయ హోస‌బాలే, ల‌క్నో ఫీల్డ్ కంపెయిన‌ర్ అనిల్ కుమార్‌, శ్రీ శ్రీ ర‌విశంక‌ర్, మోరారీ బాపుతో పాటు ఇత‌ర ప్ర‌ముఖులు పాల్గొన‌నున్నారు. కార్య‌క్ర‌మానికి 50 మంది సాధువులను ఆహ్వానించారు. మ‌హంత్ క‌మ‌ల్ నాయ‌న్ దాస్‌, రామ్ విలాస్ వేదాంతి, రాజు దాస్‌. చిత్ర‌కోట్ నుంచి మ‌హారాజ బ‌ల్ భ‌ద్రాచార్య ఈ కార్య‌క్ర‌మానికి హాజర‌య్యే అవ‌కాశం.  

ఈ జాబితాలో ఆచార్య నరేంద్ర గిరి, ప్రయాగ్రాజ్‌కు చెందిన జగత్‌గురు స్వామి వాసుదేవానంద్ సరస్వతి ఉన్నారు. అయితే స్వామి వాసుదేవానంద్ సరస్వతి వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా భూమి పూజ‌లో పాల్గొంటారు. కాశీకి చెందిన జితేంద్రానంద్ సరస్వతితో పాటు, మరో ముగ్గురు వేద పండితులు భూమి పూజ చేసే బ్రాహ్మణులలో భాగం కానున్నారు. ప్రొఫెసర్ రామ్ చంద్ర పాండే (శ్రీ కాశీ విద్యా పరిషత్ విపి), ప్రొఫెసర్ రామ్‌నారాయణ్ ద్వివేది (శ్రీ కాశీ విద్యా పరిషత్ మంత్రి), ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాండే (శ్రీ కాశీ స్కాలర్ కౌన్సిల్ సంస్థ మంత్రి) హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ప్రొఫెసర్లు హిందూ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ రిలిజియన్ ఉపాధ్యాయులు.

ఈ జాబితాలో కేరళకు చెందిన మాతా అమృతానందమై, పాట్నాలోని తఖ్త్ హర్మందిర్ సాహిబ్ నుండి జాతేదార్ జియాని ఇక్బాల్ సింగ్, హరిద్వార్ నుండి బాల్కానంద్ గిరి, పాట్నాకు చెందిన ఆచార్య కిషోర్ కునాల్ ఉన్నారు. భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని మోడీ మరో నలుగురు నాయకులతో వేదికను పంచుకోనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామ‌ జన్మభూమి న్యాస్ చీఫ్ నృత్య గోపాల్ దాస్‌తో పాటు మరో ఇద్దరు ప్రముఖులతో ప్ర‌ధాని వేదిక‌ను పంచుకోనున్న‌ట్లు స‌మాచారం.  


logo