Rajya Sabha | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ఇవాళ రాజ్యసభ (Rajya Sabha)లో చర్చ ప్రారంభమైన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) దీనిపై చర్చ మొదలుపెట్టారు. ఆ తర్వాత అన్ని పార్టీలకు చెందిన నేతలు ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో సభా కార్యకలాపాలు అర్ధరాత్రి వరకూ కొనసాగనున్నాయి. అర్ధరాత్రి వరకూ ఆపరేషన్ సిందూర్‌పై ఎగువ సభలో చర్చ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు ఉభయసభలకు 16 గంటల సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న అంటే సోమవారం మధ్యాహ్నం లోక్‌సభలో సిందూర్‌పై చర్చ ప్రారంభమైంది. అర్ధరాత్రి వరకూ చర్చ కొనసాగింది. ఇక ఇవాళ రెండో రోజు కూడా చర్చ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో సిందూర్‌పై మాట్లాడారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నట్లు ప్రకటించారు. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ముగ్గురిని అంతమొందించినట్లు ప్రకటించారు.
Also Read..
Rajnath Singh: పాక్ అణ్వాయుధ బెదిరింపులకు తలొగ్గం: రాజ్‌నాథ్ సింగ్
Gaurav Gogoi | హోంమంత్రి అమిత్ షా వైఫల్యంవల్లే పహల్గాం ఉగ్రదాడి : గౌరవ్ గొగోయ్
Amit Shah | చిదంబరం జీ.. వారు పాక్‌కు చెందిన ఉగ్రవాదులేనని చెప్పడానికి ప్రూఫ్స్ ఉన్నాయి : అమిత్ షా