Amit Shah | 26 మందిని బలిగొన్న పహల్గాం దాడి ఉగ్రవాదులు స్వదేశీ వ్యక్తులంటూ (Homegrown Terrorists Remark) కాంగ్రెస్ నేత పి.చిదంబరం (P Chidambaram) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తీవ్రంగా స్పందించారు. ఆయన పాకిస్థాన్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఆ ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన వారేనని రుజువు చేసే ప్రూఫ్స్ తమ వద్ద ఉన్నాయని షా స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో రెండో రోజు చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ సందర్భంగా ఇవాళ అమిత్ షా మాట్లాడారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. పహల్గాం దాడికి ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్నట్లు ప్రకటించారు. ఈ ఆపరేషన్ ద్వారా పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సభలో ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన వారేనని రుజువు చేసే ప్రూఫ్స్ ఉన్నాయని వెల్లడించారు.
‘చిదంబరం జీ నిన్న ఓ ప్రశ్న లేవనెత్తారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారని రుజువు ఏమిటని..? అడుగుతున్నారు. ఆయన ఎవరిని కాపాడాలనుకుంటున్నారు..? పాకిస్థాన్‌ను సమర్థించడం ద్వారా ఆయనకు ఏం వస్తుంది..? ఆపరేషన్ మహాదేవ్లో హతమైన ముగ్గురు పాక్‌కు చెందిన ఉగ్రవాదులే. అందుకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. వారి దగ్గర పాక్‌లో తయారైన చాక్లెట్లు దొరికాయి. ఆ ముగ్గురి ఉగ్రవాదుల ఓటర్ వివరాలూ ఉన్నాయి. చిదంబరం పాక్‌కు క్లీన్చిట్ ఎందుకుఇచ్చారు..? పాకిస్థాన్‌ను కాపాడేందుకు వారు చేస్తున్న కుట్రను 130 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు’ అంటూ అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
#WATCH | Delhi | On Congress leader P Chidambaram’s statement, Union Home Minister Amit Shah says, “Yesterday, former Home Minister Chidambaram raised a question about the proof of the terrorists coming from Pakistan… Whom does he want to save? What will he gain by defending… pic.twitter.com/govXFoKFXC
— ANI (@ANI) July 29, 2025
Also Read..
Digital Arrest: మహిళా డాక్టర్ డిజిటల్ అరెస్ట్.. 3 నెలల్లో 19 కోట్లు కాజేశారు
Amit Shah | పహల్గాం దాడి ఉగ్రవాదుల్లో ముగ్గుర్ని హతమార్చాం.. సిందూర్‌పై చర్చ సందర్భంగా అమిత్ షా