Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు రాజ్యసభ (Rajya Sabha)లో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటలకు ఎగువ సభలో రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు 16 గంటలు చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించిన విషయం తెలిసిందే.
ఇక దీనిపై చర్చ లోక్‌సభలో నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు దిగువ సభలో సిందూర్‌పై చర్చను రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇవాళ వరుసగా రెండో రోజు దిగువ సభలో సిందూర్‌పై చర్చ కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్‌పై చర్చలో భాగంగా ఉభయసభల్లో సభ్యులు పహల్గామ్ ఉగ్రదాడి, ప్రతిగా సైన్యం తీసుకున్న చర్యలు, భారత విదేశాంగ విధానం, రక్షణ విధానం తదితర అంశాలపై చర్చించనున్నారు.
కాగా ఈ ఏడాది ఏప్రిల్ 22న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నలుగురు జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో మారణహోమానికి పాల్పడ్డారు. మహిళలు, పిల్లలను వదిలేసి పురుష పర్యాటకులే లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఆ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 25 మంది భారత పౌరులు కాగా, ఒక నేపాలీ ఉన్నారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌పై విరుచుకుపడింది. అర్ధరాత్రి మెరుపుదాడి చేసి ఏకంగా 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
Also Read..
Parliament | ఉభయ సభలు ప్రారంభం.. సిందూర్‌పై లోక్‌సభలో కొనసాగుతున్న చర్చ
Coal Missing: 4000 టన్నుల బొగ్గు మాయం.. వర్షాల వల్ల అలా జరిగి ఉంటుందన్న మంత్రి
Heavy rain | ఢిల్లీలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు