శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 13:44:54

ఎంపీల ప్రవర్తనపై రాష్ట్రపతికి హరివంశ్‌ లేఖ

ఎంపీల ప్రవర్తనపై రాష్ట్రపతికి హరివంశ్‌ లేఖ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాజ్యసభ డివ్యూటీ చైర్మన్‌ హరివం‌శ్‌ నారాయణ్ సింగ్ మంగళవారం లేఖ రాశారు. ఈ నెల 20న వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు తనపట్ల, సభలో వ్యవహరించిన తీరు, వారి అనుచిత ప్రవర్తనను అందులో ప్రస్తావించారు. ఆ సభ్యుల చర్యను ఆయన తప్పుపట్టారు. కొందరు రూల్‌ బుక్‌ను చింపి తనపై విసిరారని, మరికొందరు టేబుళ్లపై నిలబడి అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం పేరిట గౌరవ సభ్యులు హింసాత్మకంగా ప్రవర్తించారని విమర్శించారు. రాజ్యసభలో జరిగిన పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయని, రాత్రి పూట నిద్ర కూడా పట్టడం లేదని అందులో లేఖలో పేర్కొన్నారు. ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను మంగళవారం ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్షకు దిగినట్లు పేర్కొన్నారు. ఇదే విషయంపై  రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు కూడా లేఖ రాసినట్లు ప్రస్తావించారు. తన నిరాహార దీక్షతో సభ్యులు కొంతైనా పశ్చాతాపం చెందుతారని ఆశిస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.