Dushyant Chautala | దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్‌ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
Dushyant Chautala | హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అసెంబ్లీలో బలపరీక్ష డిమాండ్ చేసిన దుష్యంత్ చౌతాలాకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను గురువారం కలిశారు.
చండీగఢ్: హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అసెంబ్లీలో బలపరీక్ష డిమాండ్ చేసిన దుష్యంత్ చౌతాలాకు (Dushyant Chautala) సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను గురువారం కలిశారు. పానిపట్‌లోని మంత్రి మహిపాల్ దండా నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఖట్టర్, మహిపాల్‌తో సుమారు అరగంటపాటు జేజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హర్యానా ప్రభుత్వంలో నెలకొన్న తాజా సంక్షోభంపై వారు చర్చించారు.
కాగా, జేజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలను కలవడం ఆ పార్టీలో చీలికగా వాదనలు వినిపిస్తున్నాయి. జేజేపీ చీఫ్ మీడియా కోఆర్డినేటర్ దీప్కమల్ సహారన్ దీని గురించి మాట్లాడారు. పార్టీ సభ్యులు విప్‌ను పాటించాలని అన్నారు. లేదా వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ‘వివిధ నియోజకవర్గాలకు చెందిన జేజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో కలిసి పనిచేయడం మేం చేశాం. పార్టీ మారితే, వారు కూడా బీజేపీ స్థానిక కేడర్ నుంచి అంతర్గత పోరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారు అంగీకరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

