Rajya Sabha : పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాల్లో భాగంగా జూలై 21 నుంచి రాజ్యసభ (Rajya Sabha) 268వ సెషన్ ప్రారంభం కానుంది. శుక్రవారం అధికారిక పార్లమెంటరీ బులెటిన్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు సభ్యులకు సమాచారం పంపించారు. రాజ్యసభ షెడ్యూల్, బిజినెస్ డేస్‌కు సంబంధించిన వివరాలను సభ్యులకు తెలియజేశారు.
జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు రాజ్యసభ సెషన్ కొనసాగనుంది. అయితే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకుల కోసం సభను ఆగస్టు 12న వాయిదా వేయనున్నారు. ఆగస్టు 18న సెషన్ పునఃప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభా కార్యకలాపాలు కొనసాగనున్నాయి.