Rajnath Singh | చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) హాజరయ్యారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ఇటీవలే పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి రాజ్‌నాథ్ మాట్లాడారు. దీనికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి కూడా వివరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం భారత్ హక్కు అంటూ కుండ బద్దలు కొట్టారు. అయితే, సమావేశం అనంతరం దీనిపై జాయింట్ డాక్యుమెంట్ (SCO document)ను సిద్ధం చేశారు. అయితే, అందులో పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) ప్రస్తావన లేకపోవడంతో దానిపై సంతకం చేసేందుకు రాజ్‌నాథ్ నిరాకరించారు. దీంతో సంయుక్త ప్రకటనను రద్దు చేశారు.
ఈ సమావేశంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన పరికరంగా మలుచుకున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. అటువంటి దేశాల చర్యలను ఏ మాత్రం ఊపేక్షించకూడదు. అలాంటి వాటిని ఎస్సీఓ ఖండించాలి. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు. విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో ఉండకూడదు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మకమైన చర్య అవసరం. దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఐక్యం కావాలి’ అంటూ ఆయా సభ్య దేశాలకు రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు.
Also Read..
Malaria vaccine | సగం ధరకే మలేరియా వ్యాక్సిన్.. ప్రకటించిన భారత్ బయోటెక్ చైర్మన్..!
Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ మా హక్కు.. చైనా గడ్డనుంచే పాక్‌పై నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్
Bus Falls Into River | అలకనంద నదిలో పడిపోయిన బస్సు.. ఒకరు మృతి.. పలువురు గల్లంతు