Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ మా హక్కు.. చైనా గడ్డనుంచే పాక్‌పై నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్
Rajnath Singh | సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Rajnath Singh | సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొన్ని దేశాలు (పరోక్షంగా పాక్‌ను ఉద్దేశిస్తూ) సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా ఉపయోగిస్తున్నాయంటూ చైనా (China) గడ్డనుంచే పాక్‌పై నిప్పులు చెరిగారు. తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) హాజరయ్యారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ఇటీవలే పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి రాజ్‌నాథ్ మాట్లాడారు. దీనికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి కూడా వివరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం భారత్ హక్కు అంటూ కుండ బద్దలు కొట్టారు.
‘కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన పరికరంగా మలుచుకున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. అటువంటి దేశాల చర్యలను ఏ మాత్రం ఊపేక్షించకూడదు. అలాంటి వాటిని ఎస్సీఓ ఖండించాలి. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు. విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో ఉండకూడదు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మకమైన చర్య అవసరం. దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఐక్యం కావాలి’ అంటూ ఆయా సభ్య దేశాలకు రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు.
Also Read..
Supreme Court | నిందితుడికి బెయిల్.. విడుదల చేయనందుకు ప్రభుత్వానికి ‘సుప్రీం’ జరిమానా..!
Bus Falls Into River | అలకనంద నదిలో పడిపోయిన బస్సు.. ఒకరు మృతి.. పలువురు గల్లంతు
Encounter | నారాయణపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

