Malaria vaccine | ప్రపంచంలోనే తొలి పిల్లల మలేరియా వ్యాక్సిన్ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం 2028 నాటికి వ్యాక్సిన్ ధరను సగానికి పైగా తగ్గిస్తామని ప్రకటించింది. దాంతో వ్యాక్సిన్ రూ.429కే అందుబాటులోకి రానున్నది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, జీఎస్కే పీఎల్సీ తాము అభివృద్ధి చేస్తున్న ఆర్టీఎస్-ఎస్ వ్యాక్సిన్‌ను తగ్గిస్తామని ప్రకటించాయి. గతంలో వ్యాక్సిన్ ధర రూ.859కు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ధర కనీసం 60శాతం తగ్గనున్నది.
రెండు కంపెనీలు వ్యాక్సిన్ల తయారీ ప్రక్రియను మెరుగుపరచడంతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడం, ఖర్చులను తగ్గించుకొని తక్కువ లాభాల ద్వారా వ్యాక్సిన్‌ను 2028 నాటికి వ్యాక్సిన్‌ను తగ్గిస్తామని రెండు కంపెనీలు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆఫ్రికా, భారత్ వంటి ప్రభావిత దేశాల్లో పిల్లలకు మలేరియా సోకకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్లు వేయనున్నారు. వాస్తవానికి ఏటా ఐదులక్షల మందికిపైగా పిల్లలు మలేరియా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆఫ్రికాలో పిల్లలకు తక్కువ ధరకే మలేరియా వ్యాక్సిన్లు అందించేందుకు వ్యాక్సిన్ అలయన్స్ (గ్లాక్సోస్మిత్‌క్లైన్) గవి అనే స్వచ్ఛంద సంస్థ పని చేస్తోంది.
ఈ సంస్థకు జీఎస్కే వ్యాక్సిన్లు సరఫరా చేస్తూ వస్తున్నది. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. జీఎస్కే, పాత్ తదితర ఫార్మా కంపెనీలు కలిసి ఆర్టీఎస్-ఎస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించిందని.. జేఎస్కే ఈ వ్యాక్సిన్ టెక్నాలజీని భారత్ బయోటెక్‌కు బదిలీ చేసిందని చెప్పారు. వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు గవికి సరఫరా చేసేందుకు 2021లోనే ఒప్పందం కుదిరిందన్నారు. వ్యాక్సిన్ల తయారీ, అభివృద్ధి కోసం భారత్ బయోటెక్ 200 మిలియన్ల పెట్టుబడి పెట్టిందన్నారు.
చారిత్రాత్మక ప్రకటన ద్వారా కోట్లాది మంది పిల్లలు, కుటుంబాలను మలేరియా భూతం నుంచి కాపాడబోతున్నామన్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ప్రక్రియ మెరుగుదలలు, చౌకైన తయారీ పద్ధతులు, కనీస లాభ విధానం ద్వారా ఈ ధర తగ్గింపు సాధ్యమైంది. మలేరియాను ఎదుర్కోవడానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి 2021 నుంచి భారత్ బయోటెక్‌తో కలిసి పనిచేస్తున్నామని జీఎస్కే చీఫ్ గ్లోబల్ హెల్త్ ఆఫీసర్ థామస్ బ్రూయర్ అన్నారు.