 
                                                            Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పలువురు ప్రముఖులు, కార్యాలయాలు, స్కూళ్లు, విమానాశ్రయాలకు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court)కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
శుక్రవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. లాయర్లు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ బెదిరింపు మెయిల్‌తో కోర్టు ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#WATCH | Jaipur: Rajasthan High Court receives a bomb threat. ATS, Bomb Disposal Squad and Dog Squad reach the Court premises. The premises are being vacated. Details awaited. pic.twitter.com/SnVu49ZAK5
— ANI (@ANI) October 31, 2025
ALso Read..
PM Modi | భారత్ నిజమైన బలం ఏంటో ఉగ్రవాదులకు తెలిసింది : ప్రధాని మోదీ
NDA Manifesto | కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. బీహార్ ఎన్నికల కోసం ఎన్డీయే మేనిఫెస్టో
Indians | ఈ ఏడాది 2,790 మంది భారతీయుల్ని వెళ్లగొట్టిన అమెరికా : కేంద్రం
 
                            