Honeymoon murder : మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) కు చెందిన మహిళ తన భర్తను హనీమూన్ (Honeymoon) పేరుతో మేఘాలయ (Meghalaya) కు తీసుకెళ్లి హత్య చేయించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) ని, హత్యకు పథక రచన చేసిన ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహ (Raj Kushwaha) ను, మరో ముగ్గురు కిరాయి హంతకులను అరెస్ట్‌చేసి విచారిస్తున్నారు.
పోలీసుల విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ ప్రకారం.. గువాహటిలో కామాఖ్య అమ్మవారి దర్శనం తర్వాత సోనమ్ దంపతులు మే 21న మేఘాలయలోని ఉత్తర ఖాసీ హిల్స్‌కు వెళ్లారు. అక్కడ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జి దగ్గర ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పరిసర ప్రాంతాలను చూసివచ్చేవారు. ఇలా రెండు రోజులపాటు వాళ్లు ఆ ఇంట్లోనే గడిపారు. మే 23న ఓ ఎత్తయిన కొండపైకి ట్రెక్కింగ్ వెళ్లేందుకు భర్తను ఒప్పించింది. ఆ కొండ ఎక్కుతున్న క్రమంలోనే కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించింది. ఆ తర్వాత అందరూ కలిసి మృతదేహాన్ని లోయలో పడేసి అక్కడి నుంచి జారుకున్నారు.
ఇరువురి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దంపతుల మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని గాలింపు చేపట్టిన పోలీసులకు దాదాపు 10 రోజుల తర్వాత అంటే జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం పదునైన ఆయుధంతో నరికిన గాయాలు కనిపించడంతో హత్య జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అతడి భార్య సోనమ్ కోసం గాలింపు కొనసాగించారు. అయినా ఆమె జాడ దొరకక పోవడంతో ఆమె భర్తను హత్య చేయించిందని పోలీసుల్లో అనుమానం బలపడింది.
ఈ క్రమంలో జూన్ 9న ఆమె యూపీలోని ఘాజీపూర్‌లో పోలీసులకు లొంగిపోయింది. ఈ లోపే ఇండోర్‌లో సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహను, ముగ్గురు కిరాయి హంతకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులు ఐదుగురు మేఘాలయ పోలీసుల కస్టడీలో ఉన్నారు. వారి నుంచి పలు వివరాలు రాబడుతున్నారు. ఈ సందర్భంగా ఉత్తర ఖాసీలో భర్తతో గడిపిన ఇంటి వివరాలను సోనమ్ రఘువంశీ వెల్లడించింది. కింది వీడియోలో ఆ ఇంటిని మీరు కూడా చూడవచ్చు.
#WATCH | East Khasi Hills, Meghalaya: Visuals from the double-decker root bridge and the Home Stay in Nongriat where Raja Raghuvanshi and Sonam Raghuvanshi stayed during their honeymoon trip pic.twitter.com/i1qNLA8jVJ
— ANI (@ANI) June 14, 2025