Ashwini Vaishnaw | రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) శుభవార్త (Good news ) చెప్పారు. ఛఠ్ పూజ (Chhath Puja), దీపావళి (Diwali) నేపథ్యంలో రైల్వే కోచ్ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 12,500 కోచ్లు అదనంగా (12,500 additional coaches) జత చేసినట్లు తెలిపారు.
శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ‘ఈ పండుగ సీజన్లో (festive season) 108 రైళ్లలో జనరల్ కోచ్ల సంఖ్యను పెంచాం. ఛఠ్ పూజ, దీపావళి ప్రత్యేక రైళ్లకు 12,500 కోచ్లు అదనంగా జత చేశాం. 2024-25లో పండగ వేళల్లో ఇప్పటి వరకూ మొత్తం 5,975 రైళ్లను నడపనున్నట్లు ప్రకటించాం. ఈ నిర్ణయం దాదాపు కోటి మందికిపైగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఈజీగా తమ గమ్యస్థానాలను కోరుకొనేందుకు సాయపడుతుంది. 2023-24లో పండుగల సీజన్లో 4,429 ప్రత్యేక రైళ్లను నడిపించాం’ అని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కాగా, దసరా, దీపావళి, ఛట్ పూజ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 12 వరకు ప్రయాణికులకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
Railway Minister Ashwini Vaishnaw says, “This festive season, General Coach increased in 108 trains. 12,500 coaches sanctioned for Chhath puja and Diwali special trains. In 2024-25, a total of 5,975 trains have been notified till today. This will facilitate more than 1 crore… pic.twitter.com/Xxe3MpRZ43
— ANI (@ANI) September 27, 2024
కాగా, ఏటా ప్రత్యేక సందర్భాల్లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతుందన్న విషయం తెలిసిందే. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పెద్ద పండగల దృష్ట్యా ఆయా మార్గాల్లో రైళ్లను నడుపుతుంటుంది. ఇక ఛఠ్ పూజ సమయంలోనూ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఉత్తర భారతీయులు ఛఠ్ పూజను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటారు. ఏటా ఈ పూజను బీహార్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నాలుగు రోజులపాటూ జరుపుకునే ఈ వేడుకకు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా సొంతూళ్లకు పయనమవుతుంటారు. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతుంది.
Also Read..
Ram Mandir | తిరుపతి లడ్డూ కల్తీ వివాదం వేళ.. అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం
Swatantra Express | స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ రైలుపై రైళ్ల దాడి.. ప్రయాణికులకు గాయాలు
Nitin Gadkari | మోదీకి బదులు.. నాకు చాలాసార్లు ప్రధాని పదవి ఆఫర్ వచ్చింది : నితిన్ గడ్కరీ