ఆదివారం 24 జనవరి 2021
National - Nov 28, 2020 , 12:22:59

జై జ‌వాన్‌.. జై కిసాన్‌ను జ‌వాన్ వ‌ర్సెస్ కిసాన్ చేశారు!

జై జ‌వాన్‌.. జై కిసాన్‌ను జ‌వాన్ వ‌ర్సెస్ కిసాన్ చేశారు!

న్యూఢిల్లీ: మ‌న నినాదం జై జ‌వాన్‌, జై కిసాన్‌.. కానీ దానిని జ‌వాన్ వ‌ర్సెస్ కిసాన్ చేసేశారు అంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై మండిప‌డ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఢిల్లీలో రైతుల ప‌ట్ల పోలీసులు అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన ఫొటోల‌ను రాహుల్ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఓ జ‌వాను ఆందోళ‌న చేస్తున్న రైతుపైకి లాఠీ ఎత్తిన ఫొటోను షేర్ చేస్తూ.. ఇది చాలా బాధాక‌ర‌మైన ఫొటో అని ట్వీట్ చేశారు. మ‌న నినాదం జై జ‌వాన్ జై కిసాన్‌.. కానీ ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అహంకారం దానిని జ‌వాన్ వ‌ర్సెస్ కిసాన్‌గా మార్చేసింది. ఇది చాలా ప్ర‌మాద‌కరం అని రాహుల్ ఆ ట్వీట్‌లో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

అటు రైతుల ఆందోళ‌న‌కు ప్రియాంకా గాంధీ కూడా మ‌ద్ద‌తు తెలిపారు. వాళ్ల‌ను అడ్డుకుంటున్న బీజేపీ స‌ర్కార్‌పై మండిప‌డ్డారు. బీజేపీ ప్ర‌భుత్వంలో దేశం ప‌రిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. బీజేపీ స్నేహితులైన కోటీశ్వ‌రులు ఢిల్లీ వ‌స్తే వారికి రెడ్ కార్పెట్ ప‌రుస్తారు. కానీ రైతులు వ‌స్తుంటే మాత్రం అడ్డుకుంటారు. మీరు రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను చేస్తే త‌ప్పు లేదు కానీ.. రైతులు ఢిల్లీకి వ‌స్తే మాత్రం త‌ప్పా అని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. 


logo