CP Radhakrishnan | మహారాష్ట్ర గవర్నర్ (Maharashtra Governor) పదవి నుంచి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) వైదొలిగారు. ఇటీవలే జరిగిన ఉపరాష్ట్రపతి (Vice-President) ఎన్నికల్లో ఆయన గెలుపొందిన విషయం తెలిసిందే. రేపు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మహా గవర్నర్ పదవి నుంచి వైదొలిగారు. గుజరాత్ గవర్నర్ (Gujarat Governor) ఆచార్య దేవవ్రత్కు (Acharya Devvrat) మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది.
భారత 15వ ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికలో ఆయనకు 452 ఓట్లు రాగా, విపక్షానికి చెందిన ఆయన ప్రత్యర్థి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు లభించాయి. 152 ఓట్ల తేడాతో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఈ నేపథ్యల శుక్రవారం రాష్ట్రపతి భవన్లో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఆర్ఎస్ఎస్, జన్‌సంఘ్ లాంటి సంస్థలతో 16 ఏండ్లకే రాధాకృష్ణన్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా, 2003 నుంచి 2006 మధ్య అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన రాష్ట్రంలో 93 రోజుల పాటు 19 వేల కి.మీ రథయాత్ర నిర్వహించారు. 2024, జూలై 31న ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్‌గా ఏడాదిన్నర పాటు చేశారు. తెలంగాణ ఇన్చార్జి గవర్నర్‌గా, పుదుచ్చెరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గానూ పనిచేశారు. 1998, 1999లో కోయంబత్తూర్ నుంచి ఆయన రెండుసార్లు ఎంపీగా చేశారు. అభిమానులు ఆయనను తమిళనాడు మోదీగా పిలుస్తారు.
Also Read..
Kulman Ghising: నేపాల్ తాత్కాలిక ప్రధాని రేసులో కుల్మన్ ఘిసింగ్..
SpiceJet | కాఠ్మాండూ వెళ్తున్న విమానంలో పనిచేయని ఏసీ.. ఉక్కపోతతో అల్లాడిన ప్రయాణికులు
Pakistani Diplomat | నకిలీ కరెన్సీ కేసు.. పాకిస్థాన్ దౌత్యవేత్తకి ఎన్ఐఏ సమన్లు