SpiceJet | సింగపూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో (faulty air conditioning) ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా మరో విమానంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది.
గురువారం ఢిల్లీ నుంచి నేపాల్ రాజధాని కాఠ్మాండూ (Kathmandu)కు వెళ్లే స్పైస్‌జెట్ (SpiceJet) విమానంలో ఎయిర్ కండిషనింగ్ పనిచేయలేదు. దీంతో తీవ్రమైన వేడితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేడి తట్టుకోలేక విమానం నుంచి కిందకు దిగిపోయారు. మరోవైపు విమానాన్ని అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు స్పైస్‌జెట్ తెలిపింది.
#WATCH | SpiceJet passengers travelling from Delhi to Kathmandu (SG 41) had to wait inside an aircraft without air conditioning (AC). The passengers have disembarked from the aircraft. Further details awaited.
According to the airline: Aircraft witnessed a technical snag… pic.twitter.com/SVdWPmqjym
— ANI (@ANI) September 11, 2025
కాగా, 200 మందికిపైగా ప్రయాణికులతో ఎయిర్ ఇండియాకు (Air India) చెందిన బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ బుధవారం రాత్రి 11గంటల సమయంలో సింగపూర్‌కు బయల్దేరాల్సి ఉంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తిందని అనౌన్స్మెంట్ చేశారు. రెండు గంటలు గడిచినా మరమ్మత్తులు పూర్తి కాలేదు. కారణం ఏంటనే తెలుపకుండానే ప్రయాణికులను విమానంలో నుంచి కిందకు దించేసి ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్‌కు తరలించారు. ఏసీ పనిచేయక పోవడం వల్లే సమస్య తలెత్తినట్లు తెలుస్తున్నది.
Also Read..
Russian Army | రష్యా సైన్యంలో చేరొద్దు.. భారతీయులకు కేంద్రం కీలక సూచన
Air India | ఎయిర్ ఇండియా విమానంలో పనిచేయని ఏసీ.. 2 గంటల తర్వాత ప్రయాణికులను దించేశారు
RJD leader | బీహార్‌లో ఆర్జేడీ నేత దారుణ హత్య