RJD leader | బీహార్ (Bihar)లో ఓ రాజకీయ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్జేడీకి (RJD leader) చెందిన రాజ్‌కుమార్ రాయ్ (Rajkumar Rai) అలియాస్ అల్లా రాయ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు (shot dead). త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) జరగనున్న వేళ ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ఎస్పీ పరిచయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్రగుప్త్ (Chitragupt) నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మున్నాచక్ ప్రాంతంలో (Munna Chak area) ఈ హత్య జరిగింది. బుధవారం రాత్రి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రాయ్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో రాయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. రాయ్‌ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
హత్య జరిగిన ప్రదేశంలో ఆరు బుల్లెట్ షెల్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. భూ వివాదమే హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాట్నా (Patna)లోని రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాజ్‌కుమార్ రాయ్ సిద్ధమయ్యారు.
Also Read..
Nepal: హెలికాప్టర్లకు తాళ్లు కట్టి.. వేలాడుతూ పారిపోయిన మంత్రులు, కుటుంబసభ్యులు.. వీడియో
‘హాల్’కు ఎస్ఎస్ఎల్వీ రాకెట్ టెక్నాలజీ బదిలీ
వారంలో 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే: మైక్రోసాఫ్ట్