న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనను బలోపేతం చేసేందుకు ‘ఇస్రో’ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్ఎల్వీ (చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం) తయారీకి సంబంధించిన టెక్నాలజీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు బదిలీ చేసింది.
టెక్నాలజీ బదిలీపై హాల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సాంకేతిక బదిలీ ప్రక్రియతో ‘హాల్’ ఉత్పత్తి చేసే మొదటి ఎస్ఎస్ఎల్వీ రాకెట్ 2027లో సిద్ధంకానున్నది. జూన్ 20న నిర్వహించిన బిడ్డింగ్‌ను దక్కించుకున్న ‘హాల్’కు ఎస్ఎస్ఎల్వీ రాకెట్ తయారీకి సంబంధించి సమగ్ర శిక్షణ, సాంకేతిక సహాయం ఇస్రో నుంచి అందుతుంది.