నేపాల్ లో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆపద్ధర్మ ప్రధాని రేసులో కొత్త వ్యక్తి దూసుకొచ్చారు. ఎలక్ట్రికల్ ఇంజినీర్ కుల్మన్ ఘిసింగ్( Kulman Ghising) ఆ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జెన్ జెడ్ నిరసనకారులు ఆయన మద్దుతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చీఫ్‌గా ఉన్న ఆయన నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కుల్మన్ ఘిసింగ్‌కు అధికార వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్నది. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. దేశంలో విద్యుత్తు సమస్యను తీర్చిన వ్యక్తిగా ఆయన్ను గుర్తిస్తారు.
వాస్తవానికి ఆపద్ధర్మ ప్రధాని రేసులో కాఠ్మాండు మేయర్ బాలెన్ షా, మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి ఉన్నారు. కానీ వాళ్లను వెనక్కి నెడుతూ కుల్మన్ ఘిసింగ్ ముందుకు వచ్చారు. బాలెన్ షా, సుశీల కుర్కిలు.. తాత్కాలిక ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. మాజీ జడ్జీలు ప్రధానులు కాలేరని రాజ్యాంగం చెబుతున్నట్లు కొందరు నిరసనకారులు వాదించారు. సుశీల వయసు 73 ఏళ్లు కావడంతో.. ఆ లేట్ ఏజ్‌లో ఆమె దేశాన్ని లీడ్ చేయలేరని విమర్శలు వచ్చాయి.
కుల్మన్ ఘిసింగ్ ఇండియాలోని జెంషెడ్‌పూర్‌లో ఉన్న రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత నేపాల్‌లోని పుల్చోక్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యను పూర్తి చేశారు. ఎంబీఏ కూడా చదివారాయన.