చండీగఢ్: పంజాబ్‌కు చెందిన వ్యక్తి స్టూడెంట్ వీసాపై రష్యా వెళ్లాడు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో అతడ్ని బలవంతంగా ఆర్మీలోకి చేర్చుకున్నారు. (Punjab Man Forced into Russia Army) ఎలాంటి మిలిటరీ ట్రైనింగ్ లేని ఆ వ్యక్తిని యుద్ధభూమికి పంపారు. అతడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన 25 ఏళ్ల బూటా సింగ్ 2024 అక్టోబర్ 24న ఢిల్లీకి చెందిన ఏజెంట్ ద్వారా రష్యా వెళ్లాడు. ఆ ఏజెంట్ అతడి కుటుంబం నుంచి రూ. 3.5 లక్షలు వసూలు చేశాడు.
కాగా, బూటా సింగ్ కొన్ని నెలలు మాస్కోలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 18న రష్యన్ దళాలు అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి. బూటా సింగ్‌తోపాటు పంజాబ్, హర్యానా నుంచి రష్యా వెళ్లిన 14 మందిని సైనిక శిబిరాలకు తరలించారు. ఎలాంటి సైనిక శిక్షణ లేకుండా బలవంతంగా ఉక్రెయిన్ ఆర్మీతో యుద్ధానికి వారిని పంపారు. వీరిలో ఆరుగురు అదృశ్యమయ్యారు.
మరోవైపు సెప్టెంబర్ 12న బూటా సింగ్ చివరిసారి వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా తన కుటుంబంతో మాట్లాడాడు. ఆ తర్వాత అతడి నుంచి వారికి ఎలాంటి కాంటాక్ట్ లేదు. దీంతో బూటా సింగ్ గురించి అతడి కుటుంబం ఆందోళన చెందుతున్నది. సురక్షితంగా తిరిగి తీసుకురావాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
Also Read:
brain-eating amoeba | కేరళలో 67కు చేరిన మెదడు తినే అమీబా కేసులు.. 18 మరణాలు నమోదు
man shot wife dead | మరో వ్యక్తి బర్త్ డే పార్టీలో భార్య.. వీడియో చూసి కాల్చి చంపిన భర్త