సోమవారం 08 మార్చి 2021
National - Jan 26, 2021 , 09:03:19

బారికేడ్ల‌ను బ్రేక్ చేసిన అన్న‌దాత‌లు.. వీడియో

బారికేడ్ల‌ను బ్రేక్ చేసిన అన్న‌దాత‌లు.. వీడియో

న్యూఢిల్లీ : నూత‌న వ్య‌వ‌సాయ చట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీలో ట్రాక్ట‌ర్ల ర్యాలీకి అన్న‌దాత‌లు పిలుపునిచ్చిన విష‌యం విదిత‌మే. రైతుల ట్రాక్ట‌ర్ ప‌రేడ్‌కు పోలీసులు కూడా అనుమ‌తిచ్చారు. దీంతో కిసాన్ గ‌ణ‌తంత్ర ప‌రేడ్ పేరుతో రైతులు క‌వాతు నిర్వ‌హించ‌నున్నారు. అయితే సింఘూ బోర్డ‌ర్ వ‌ద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల‌ను రైతులు తొల‌గించారు. బారికేడ్ల‌ను ప‌క్క‌కు తోసి.. ఢిల్లీ వైపు 5 వేల మందికి పైగా రైతులు ర్యాలీగా వెళ్తున్నారు. అన్న‌దాత‌లంత‌రూ జాతీయ జెండాల‌ను చేత‌బూని ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హిస్తున్నారు. హ‌ర్యానా, ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళ‌న‌ల‌కు సింఘూ బోర్డ‌ర్ ప్ర‌ధాన కేంద్రంగా మారిన విష‌యం తెలిసిందే. రిప‌బ్లిక్ డే ప‌రేడ్ ముగిసిన త‌ర్వాత రైతుల ట్రాక్ట‌ర్ ప‌రేడ్ ఉంటుంది. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లోని సింఘూ, టిక్రి, ఘాజీపూర్ పాయింట్ల నుంచి మొద‌ల‌య్యే ర్యాలీలో 2 ల‌క్ష‌ల ట్రాక్ట‌ర్లు పాల్గొంటాయ‌ని రైతులు తెలిపారు. 

VIDEOS

logo