నార్నూర్ : ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా గాదిగూడ మండలం పిప్రి గ్రామానికి చెందిన సిడం సోము-గౌతమి బాయి దంపతుల కుమారుడు సిడం మహేందర్ ( Mahendar ) నేషనల్ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ( Thai Boxing Championship ) లో రాణించడం హర్షనీయమని ఝరి రాయి సెంటర్ నాయకులు మేడి మండడి దౌలత్ రావు, సిడం జంగు పటేల్ అన్నారు.
మండలంలో సిడం మహేందర్తో పాటు తల్లిదండ్రులను ఝరి రాయి సెంటర్, ఆదివాసి అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూజాతీయ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ప్రతిభ కనబరచడం, గోల్డ్ మెడల్ సాధించడం ఆదివాసి సమాజానికి గర్వకారణమన్నారు. ఆదివాసి యువత, యువకులు చదువుతోపాటు క్రీడలలో రాణించే వారికి ఆదివాసి సమాజం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గిత్తేదార్ కొడప జాకు, రాజ్ గోండు సేవాసమితి అధ్యక్షుడు మెస్రం శేఖర్ బాబు, మండల అధ్యక్షుడు మెస్రం ధన్ను, ఉపాధ్యాయులు మెస్రం లింగు, కనక విశేష్ రావు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోయం మారుతి, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్, నాయకులు పూసం బాదిరావు, పాండురంగ, వామన్, నాగోరావ్, భీం రావ్, హుస్సేన్, దిగంబర్, లచ్చు, ధర్ము, శ్రీధర్, లింగు, విజయ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.