Loksabha Elections 2024 : దేశం పురోగమిస్తోందని, ఆర్ధిక వ్యవస్ధ బలోపేతమైందని వార్తా చానెల్స్ ఊదరగొడుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. సంతోషంగా ఉన్న రైతులను టీవీల్లో చూపిస్తున్నారు..కాంగ్రెస్ 70 ఏండ్లలో చేయలేని పనులను ప్రధాని మోదీ పదేండ్లలో చేసి చూపారని చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.
ఈ టీవీ ఛానెల్స్ అన్నీ బిలియనీర్లకు చెందినవని, వీటిని ఈ పదేండ్లలో కాషాయ పాలకులు కొనేశారని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. మీరు వాస్తవాలను ఎక్కడా చూడలేరని,, సత్యం అనేది మన జీవితాలనే ప్రతిబింబిస్తుందని, మోదీ హయాంలో మీలో ఏ ఒక్కరూ పురోగతి సాధించలేదని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార కార్యక్రమం ఆసాంతం హిందూ-ముస్లిం చుట్టే తిరిగిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేష్ అంతకుముందు ఆరోపించారు.
ప్రధాని కేవలం హిందూ, ముస్లిం రాజకీయాలు చేయదలచుకుంటే ఆయన ప్రజా జీవితంలో కొనసాగేందుకు పనికిరారని చెప్పారు. జార్ఖండ్లో జైరాం రమేష్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. మన జాతీయ చిహ్నం కింద సత్యమేవ జయతే అని రాసి ఉండగా ప్రధాని మాత్రం పొరపాటున కూడా నిజాలు మాట్లాడరని అన్నారు.అసత్యమేవ జయతే అనే మూల సిద్ధాంతంతో పనిచేసే తొలి ప్రధాని మోదీయేనని దుయ్యబట్టారు.అసత్యాలతో పాలన సాగించే మోదీ ఓ బ్లఫ్మాస్టర్ అని జైరాం రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read More :
Double iSmart | రామ్ పోతినేని బర్త్ డే స్పెషల్.. ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ రిలీజ్