Double iSmart | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. పూరీ ముంబైలో డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్లాన్ చేశాడని.. ఈ సీన్ కోసం ఏకంగా రూ.7 కోట్లు పెడుతున్నాడని టాక్. ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
నేడు రామ్ పోతినేని (Ram Pothineni) పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ రామ్‌కి బర్త్ డే విషెస్ తెలుపుతూ.. డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 85 సెకన్లు ఉన్న ఈ టీజర్‌ను చూస్తే.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ ఇస్మార్ట్ అంటూ రామ్ మాస్ ఎంట్రీతో గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఇక స్టోరీ రివీల్ చేయకుండా మరోసారి ఇస్మార్ట్ శంకర్ రోల్లో పవర్‌ఫుల్‌గా కనిపించాడు రామ్. టీజర్లో సంజయ్ దత్ పాత్రను కూడా కాస్త వైలెంట్గానే చూపించారు.
ఆలీ, కావ్య థాపర్, షియాజీ షిండే, ఉత్తేజ్, గెటప్ శీను తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.