Priyank Kharge : కర్నాటక సీఎం మార్పు వ్యవహారంపై సాగుతున్న ఊహాగానాలను రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే తోసిపుచ్చారు. ప్రియాంక్ ఖర్గే సోమవారం కలబురగిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కర్నాటక అసెంబ్లీలో విపక్ష నేత ఆర్. అశోకపై బీజేపీకి విశ్వాసం లేదని, ఈ విషయం ముందు అశోక గుర్తెరగాలని హితవు పలికారు.
కాషాయ నేతలు రాజ్‌భవన్, గవర్నర్‌ను తమ పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకుంటున్నారంటే ఆ పార్టీ దయనీయ స్ధితి వెల్లడవుతున్నదని ఎద్దేవా చేశారు. సిద్ధరామయ్య పదవి గురించి కలత చెందడం మాని వారు తమ కుర్చీలను కాపాడుకోవడం కోసం పనిచేస్తే మంచిదని హితవు పలికారు. కర్నాటకలో సీఎం, డిప్యూటీ సీఎం పదవులు ఖాళీగా లేవని స్పష్టం చేశారు.
సీఎం సిద్ధరామయ్యను మార్చేస్తారని కాషాయ నేతలు చేస్తున్న ప్రచారం నిరాధారమని అన్నారు. కాగా, కర్నాటక సీఎం పదవిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఈ వ్యవహారంపై కర్నాటక బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ సీఎం సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగిస్తారని తెలుసని వ్యాఖ్యానించారు. కర్నాటక సీఎం పదవిపై పలువురు కాంగ్రెస్ నేతలు కన్నేశారని అన్నారు. కర్నాటకలో సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
Read More :
Firecrackers Ban | ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం.. కాలుష్యంతో కేజ్రీవాల్ సర్కారు కీలక నిర్ణయం..!